Nagumomu Thaarale Video Song:'నాతో ప్రేమలో పడితే చస్తావ్'.. మనసులు దోచేస్తున్న నగుమోము తారలే సాంగ్

Published : Dec 02, 2021, 12:16 PM IST
Nagumomu Thaarale Video Song:'నాతో ప్రేమలో పడితే చస్తావ్'.. మనసులు దోచేస్తున్న నగుమోము తారలే సాంగ్

సారాంశం

సంవత్సరాల నిరీక్షణ రోజుల దూరంలో ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు. నేడు రాధే శ్యామ్ చిత్రం నుండి 'నగుమోము తారలే..' సాంగ్ విడుదలైంది. 

ప్రభాస్ (Prabhas) చివరి చిత్రం సాహో విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఇక మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న రాధే శ్యామ్ ఎట్టకేలకు థియేటర్స్ లో దిగనుంది. షూటింగ్ ఆలస్యం కావడంతో మూవీ విడుదల చాలా ఆలస్యం అయ్యింది. దానికి తోడు మూవీ అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెట్టారు చిత్ర యూనిట్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో పాటు చిత్ర దర్శకుడు రాధాకృష్ణ పై సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్యాన్స్ తరచుగా ట్రోల్స్ కి తెగబడేవారు. 


అయితే వాళ్ళ నిరీక్షణ, అసహనం అన్నీ మెల్లగా వీడిపోతున్నాయి. రాధే శ్యామ్ (Radhe shyam)నుండి వరుస అప్డేట్స్ వస్తుండగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నేడు ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ నంబర్ నగుమోము తారలే సాంగ్ (Nagumomu Thaarale) విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ స్వరపరచిన మెలోడీ మనసులను దోచేస్తుంది. సెన్సేషనల్ యంగ్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను చాలా హృద్యంగా పాడారు. ఇక ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు.  ఇదే సాంగ్ కి భాషలకు అనుగుణంగా వివిధ కంపోజర్స్ లిరిక్స్ అందించారు. 

Also read బాలయ్య ‘అఖండ’రివ్యూ
సాంగ్ లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. పూజా హెగ్డే (Pooja hegde), ప్రభాస్ ల లుక్స్, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. మొత్తంగా రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్ లో ఓ మాస్టర్ పీస్ కానుంది అనడంలో సందేహం లేదు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రాధే శ్యామ్ విడుదల కానుంది. పునర్జన్మల నేపథ్యంలో పీరియాడిక్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు