Allu arjun: వరద బాధితుల కోసం అల్లు అర్జున్ ఆర్థిక సహాయం!

Published : Dec 02, 2021, 11:24 AM ISTUpdated : Dec 02, 2021, 11:26 AM IST
Allu arjun: వరద బాధితుల కోసం అల్లు అర్జున్ ఆర్థిక సహాయం!

సారాంశం

 విపత్తు సమయాల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా నిలిచే చిత్ర పరిశ్రమ స్పందించింది. తమకు తోచిన విధంగా సీఎం సహాయనిధికి స్టార్ హీరోలు విరాళాలు అందజేస్తున్నారు. 

రాయలసీమను ఊహించని వరదలు ముంచెత్తాయి. ఎన్నడూ లేని విధంగా చిత్తూరు, కడప జిల్లాలలో అతిభారీ వర్షపాతం నమోదైంది. నీళ్లు లేక ఉసూరుమనే చెరువులు, కాలువలు, నదులు ఉగ్రరూపం దాల్చాయి. నీటి ప్రాజెక్టులు నిండుకుండలా తయారై జనాలను బయపెట్టాయి. కొన్ని ప్రాంతాలలో ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా... వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. విపత్తు సమయాల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా నిలిచే చిత్ర పరిశ్రమ స్పందించింది. తమకు తోచిన విధంగా సీఎం సహాయనిధికి స్టార్ హీరోలు విరాళాలు అందజేస్తున్నారు. 


రెండు రోజులుగా టాలీవుడ్ స్టార్స్ వరుసగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ వరద బాధితుల సహాయార్థం రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. వరదల కారణంగా కకావికలమైన సామాన్యుల బాధలపై విచారం వ్యక్తం చేశారు. తన ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ (NTR), మహేష్, చిరంజీవి, రామ్ చరణ్ (Ram charan), ప్రభాస్ ఒక్కొక్కరు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. 


మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 17న పుష్ప మొదటి భాగం గ్రాండ్ గా విడుదల కానుంది. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం పుష్ప కాగా... దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఆయన స్మగ్లర్ గా కనిపించనున్నారు.

 Also read ఏపీ వరదలుః బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌.. అర్థిక సాయం..
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పుష్ప (Pushpa) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. పుష్ప మూవీ ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఇక పుష్ప మూవీలో సమంత ఐటెం సాంగ్ లో కనిపించడం విశేషం. మొత్తంగా భారీ అంచనాలతో విడుదలవుతున్న పుష్ప ఇండియన్ స్క్రీన్ పై ఈ రేంజ్ రచ్చ చేస్తుందో చూడాలి. 

Also read ఏపీ వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్‌.. చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌ విరాళాలు..
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే