Nagababu : నవ్వుల షోకి జడ్జిగా నాగబాబు!

Published : Dec 02, 2021, 10:48 AM ISTUpdated : Dec 02, 2021, 11:21 AM IST
Nagababu : నవ్వుల షోకి జడ్జిగా నాగబాబు!

సారాంశం

జబర్దస్త్ షో నుండి బయటికి వచ్చాక నాగబాబు బుల్లితెర ప్రేక్షకులకు దూరం అయ్యారు. నాగబాబు అభిమానులు ఆయన నవ్వులను, కామెడీ పంచ్ లను చాలా మిస్ అవుతున్నారు. అయితే తిరిగి వాళ్ళను ఎంటర్టైన్ చేయడానికి మరలా వచ్చేశారు.   


ఏడేళ్లకు పైగా జబర్దస్త్ జడ్జిగా ఉన్నారు నాగబాబు (Nagababu). 2019లో ఆయన షో నుండి బయటికి రావడం జరిగింది. రెమ్యూనరేషన్ తో పాటు ఆర్టిస్ట్స్ వెల్ ఫేర్ గురించి జబర్దస్త్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని, వాళ్ళ లాభాల దాహంలో కమెడియన్స్ ని దోచేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జబర్దస్త్ షో క్లిష్టపరిస్థితులలో నన్ను ఆదుకున్న మాట వాస్తమే.. అదే సమయంలో షో సక్సెస్ కావడంలో నా పాత్ర కూడా చాలా ఉందని నాగబాబు సమర్ధించుకున్నారు. జబర్దస్త్ లో తనకు బాగా సన్నిహితులైన టీమ్ లీడర్స్ చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీతో పాటు జబర్దస్త్ డైరెక్టర్స్ ని వెంట తీసుకెళ్లారు. 

జబర్దస్త్ (Jabardasth) కి పోటీగా అదిరింది పేరుతో జీ తెలుగులో ఓ కామెడీ షో స్టార్ట్ చేశారు. అది అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేకపోయింది. దీనితో అదిరింది షోకి తెరదింపి బుల్లితెరకు దూరం అయ్యారు. అయితే చాలా కాలం తర్వాత నాగబాబు బుల్లితెరపై కనువిందు చేశారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ శ్రీదేవితో పాటు ఆయన వేదిక పంచుకున్నారు. 

బిగ్ బాస్ షో కారణంగా జబర్దస్త్ షో నుండి వెళ్ళిపోయిన అవినాష్ తో పాటు మరికొందరు కమెడియన్స్ స్టార్ కమెడియన్స్ షోలో స్కిట్స్ చేస్తున్నారు. ఇక ఈ షోకి జడ్జిలుగా శ్రీదేవి, శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ బిజీ కావడంతో ఆయన స్థానంలో నాగబాబు వచ్చి చేరినట్లు తెలుస్తుంది. మరి ఆయన పోస్ట్ తాత్కాలికమా, పర్మినెంటా అనేది తెలియాల్సి ఉంది. 

Also read చిరు సినిమాలో చేసే విషయమై క్లారిటీ ఇచ్చిన సల్మాన్

ఇక ఇటీవల జరిగిన మా అధ్యక్ష ఎన్నికలలో నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి సపోర్ట్ చేశారు. ప్రత్యర్థి మంచు విష్ణు చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. కేవలం ప్రాంతీయవాదంతో ప్రకాష్ రాజ్ ని ఓడించిన మా సభ్యునిగా కొనసాగడం నాకు ఇష్టం లేదని నాగబాబు రాజీనామా చేశారు. 

Also read Bigg Boss Telugu 5: సిరి, శ్రీరామ్‌లకు చుక్కలు చూపించిన సన్నీ.. షణ్ముఖ్‌ శాపనార్థాలకు కన్నీళ్లు..

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు