Salman Khan: ఇండియన్ ఆర్మీని గౌరవించే సినిమాలకు సపోర్ట్ చేయాలి.. సల్మాన్ మూవీపై వివేక్ ఒబెరాయ్ కామెంట్స్

Published : Nov 29, 2026, 07:00 PM IST
Vivek Oberoi On Salman Khan Maatrubhumi

సారాంశం

సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'మాతృభూమి'పై బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించాడు. డైరెక్టర్ అపూర్వ లాఖియాకు బెస్ట్ విషెస్ చెప్పాడు. గతం లో వీళ్లిద్దరి మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో వివేక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ నటించనున్న కొత్త సినిమా 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' సినిమాకి తన బెస్ట్ విషెస్ అందించాడు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ వార్ డ్రామా సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కాలని కోరుకున్నాడు. గతం లో సల్మాన్ ఖాన్ తో వివేక్ కు ఉన్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇండియన్ ఆర్మీని గౌరవించే సినిమాలకు సపోర్ట్ ఇవ్వాలన్న వివేక్ ఒబెరాయ్

మీడియాతో చిట్ చాట్ లో.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా గురించి వివేక్ ను అడిగారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. దీనిపై స్పందించిన వివేక్.. భారత సాయుధ దళాల ధైర్యాన్ని, త్యాగాలను చూపించే సినిమాలకు ప్రేక్షకుల నుంచి తప్పకుండా సపోర్ట్ దక్కాలన్నాడు.

"మన ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలు, త్యాగాల మీద తీసే ఏ సినిమాకైనా మనం ఆడియన్స్ గా పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా" అని వివేక్ చెప్పాడు.

అలాగే ఈ సినిమా ప్రజల్లో స్ఫూర్తిని నింపి, దేశం కోసం పోరాడే సైనికుల పట్ల మరింత గౌరవం పెరిగేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

డైరెక్టర్ అపూర్వ లాఖియా నా ఫ్రెండ్ అన్న వివేక్

ఈ సినిమా డైరెక్టర్ అపూర్వ లాఖియా గురించి కూడా వివేక్ పాజిటివ్ గా మాట్లాడాడు. అతన్ని తన ఫ్రెండ్ గా చెబుతూ.. 2007లో వచ్చిన 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' సినిమాలో ఇద్దరం కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నాడు.

"ఈ సినిమా డైరెక్టర్ అపూర్వ లాఖియా నా ఫ్రెండ్. 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' సినిమాకి మేమిద్దరం కలిసి పనిచేశాం. అందుకే అతనికి కూడా నా బెస్ట్ విషెస్ చెబుతున్నా. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, దేవుడి ఆశీస్సులు అతనికి ఉండాలని కోరుకుంటున్నా" అని వివేక్ అన్నాడు.

సల్మాన్ ఖాన్ సినిమాపై వివేక్ పాజిటివ్ గా స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' స్టోరీ ఏంటి?

అపూర్వ లాఖియా డైరెక్ట్ చేస్తున్న 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' సినిమాలో సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2020లో ఇండియా-చైనా మధ్య జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో భారత సైనికుల ధైర్యం, త్యాగాలను కళ్లకు కట్టనున్నారు.

ఈ సినిమా 2026 డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. మరోవైపు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ గ్రే' కూడా 2026 డిసెంబర్ 11న రిలీజ్ కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య సూపర్ హిట్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..
Sukumar: అల్లు అరవింద్ తో ఛాలెంజ్ చేసి లక్ష రూపాయలు ఓడిపోయిన సుకుమార్..గెలిచి ఉంటే ఎంత వచ్చేదో తెలుసా ?