
ఎంత ఫేమస్ అయినా, ఎంత డబ్బు ఉన్నా, భార్య దగ్గర తిట్లు తినడం ఏ మొగుడికైనా తప్పదు. ఏదో ఒక కారణంతో భార్య ముందు తల వంచాల్సిందే. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 'కాఫీ విత్ కరణ్' షోలో జరిగిన లైవ్ కాల్లో ట్వింకిల్ ఖన్నా తన భర్త అక్షయ్ కుమార్‌కి ఏకిపారేశారు.
కరణ్ జోహార్ హోస్ట్ చేసే పాపులర్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9 తాజా ఎపిసోడ్లో అక్షయ్ కుమార్, నటుడు రవి కిషన్ గెస్ట్లుగా వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ తెగ సరదాగా గడిపారు. కానీ షోలో ఒక చోట అక్షయ్ కుమార్ తన భార్య, నటి ట్వింకిల్ ఖన్నాకు ఫోన్ చేశారు. అప్పుడు జరిగిన సంభాషణ అందరినీ కడుపుబ్బా నవ్వించింది.
కాఫీ విత్ కరణ్ షోలో 'కాల్ ఏ స్టార్' అనే స్పెషల్ సెగ్మెంట్ ఉంది. ఇందులో గెస్ట్‌లు తమకు ఇష్టమైన సెలబ్రిటీకి కాల్ చేయొచ్చు. అలాగే అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు కాల్ చేశారు. అయితే, కాల్ లిఫ్ట్ చేసిన ట్వింకిల్, భర్త వాయిస్ వినగానే సంతోషపడే బదులు తన అసహనాన్ని బయటపెట్టారు. పొద్దుపొద్దున్నే కాల్ చేసి నిద్ర పాడుచేసినందుకు విసుక్కున్నారు.
ఫోన్లో మాట్లాడుతూ, "నిన్న రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఇప్పుడు పొద్దున్నే లేపి నా నిద్ర మొత్తం పాడుచేశావ్. ఉదయం 6 గంటలకే భజనలు ఎవరు పెడతారు? నువ్వు అంత గట్టిగా పాటలు పెడతావేంటి. నిన్ను నువ్వు అనూప్ జలోటా అనుకుంటున్నావా?" అని భర్తను నిలదీశారు ట్వింకిల్.
అంతటితో ఆగకుండా, బాత్రూమ్ తలుపు సరిగ్గా వేయమని ఎన్నిసార్లు చెప్పినా అక్షయ్ వినట్లేదని కంప్లైంట్ చేశారు. భార్య మాటలు విన్న అక్షయ్ కుమార్‌కి ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ కూల్ అని సర్దిచెప్పారు.
ప్రస్తుతం ఈ ఫోన్ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్షయ్ కుమార్‌కి భార్య ట్వింకిల్ ఖన్నా క్లాస్ పీకడం చూసి అభిమానులు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ వేరే వాళ్ల కాళ్లు లాగే అక్షయ్‌కి ఈసారి ఇంట్లోనే క్లాస్ దొరికిందని నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.