
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా సింపుల్, అట్రాక్టివ్ డ్రెస్ లతో తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఫిదా చేస్తుంటుంది. రీసెంట్ గా ముంబైలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ ఈవెంట్ కు ఆమె లైట్ పింక్ కలర్ సింపుల్ చీరలో వచ్చింది. ఈ టైమ్ లో ఆమె సద్గురుతో చేసిన ముచ్చట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 22న ముంబైలోని ఫెయిర్ మాంట్ హోటల్ లో ఓ ఈవెంట్ జరిగింది. సద్గురు రాసిన 'Disappearing Faces' అనే ఫోటో పుస్తకం గురించి డిస్కస్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు తమన్నా లైట్ పింక్ కలర్ చీర కట్టుకుని వచ్చింది. ఆ చీరను ఇటాలియన్ ప్యూర్ సిల్క్ ఆర్గంజా క్లాత్ తో తయారు చేశారు.
Picchika బ్రాండ్ కు చెందిన ఈ చీర ధర అక్షరాలా 65 వేల రూపాయలు. ఆ చీర మీద చేత్తో డిజైన్ చేసిన పింక్ లిల్లీ, తెల్ల పారిజాతం పూల బొమ్మలు ఉన్నాయి. ఈ పూలకు గోల్డ్ కలర్ గోటా వర్క్ కూడా చేశారు. అంతే కాదు, కోటా సిల్క్ దుపట్టా కూడా ఉంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, చేత్తో చేసిన ప్రతి పూల డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ చీరకు మ్యాచింగ్ గా ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ కు చెందిన నెక్లెస్, చెవి దుద్దులు, బంగారు గాజులు వేసుకుంది తమన్నా. లైట్ పింక్ మేకప్, నుదుటిన ఎర్రటి బొట్టు ఆమె అందాన్ని ఇంకా పెంచేశాయి.
సద్గురు తీసిన ఫోటోలను తమన్నా చూసింది. ఆ తర్వాత ఆయనకు కొన్ని ప్రశ్నలు వేసింది. రోజులు గడిచే కొద్దీ వయసు పైబడటం అనేది కామన్. కానీ దాన్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అని అడిగింది. దానికి సద్గురు బదులిస్తూ.. పాత రోజుల్లో వయసు పెరగడాన్ని చాలా సహజంగా, గౌరవంగా తీసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు యవ్వనం, ఫిజికల్ అందం మీద జనాలకు పిచ్చి పెరిగిపోయింది. ముందు ముందు ఇది బ్యాలెన్స్ తప్పుతుంది అని అన్నారు.
అప్పుడు తమన్నా.. వయసు పెరిగే కొద్దీ మనం ఎలా కనిపిస్తాం అనేది మన వంశపారంపర్యంగా వస్తుందా లేక మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా అని అడిగింది. దానికి ఆయన.. శారీరక లక్షణాల్లో వంశపారంపర్యం పాత్ర కచ్చితంగా ఉంటుంది. అంతే కాదు మన లోపలి మనస్తత్వం కూడా చాలా ఇంపార్టెంట్. లోపల సంతోషంగా ఉంటే ఆ మొహం ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది అని చెప్పారు.
డిస్ అపియరింగ్ ఫేసెస్ అనేది సద్గురు రాసిన పుస్తకం. ఇందులో 208 పేజీలు ఉన్నాయి. దీన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఎబరీ ప్రెస్ వాళ్లు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకంలో సద్గురు దశాబ్దాల పాటు చేసిన ప్రయాణాల గురించి ఉంది. నేపాల్, టిబెట్ తో పాటు హిమాలయాల్లోని కష్టమైన ప్రాంతాల్లో సద్గురు చేసిన యాత్రలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. మోడ్రన్ లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్ వల్ల అక్కడి జనాల బతుకులు ఎలా మారుతున్నాయి అనేది ఈ పుస్తకం చెప్తోంది.