కేరళ స్టోరీ చిత్ర యూనిట్ జీవితాలు మునుపటిలా ఉండవు, హింసిస్తారు.. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Published : May 06, 2023, 05:38 PM IST
కేరళ స్టోరీ చిత్ర యూనిట్ జీవితాలు మునుపటిలా ఉండవు, హింసిస్తారు.. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

ఇప్పుడు ఎక్కడా విన్నా ది కేరళ స్టోరీస్ చిత్ర పేరే వినిపిస్తోంది. ఈ సంచలనాత్మక చిత్రం మే 5న పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఎక్కడా విన్నా ది కేరళ స్టోరీస్ చిత్ర పేరే వినిపిస్తోంది. ఈ సంచలనాత్మక చిత్రం మే 5న పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన సంగతి తెలిసిందే. అనేక వివాదాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అదా శర్మ ఈ చిత్రంలో షాలిని ఉన్నికృష్ణన్ గా ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే టీజర్, ట్రైలర్ విడులయ్యాక కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ లేపింది.  బీజేపీ ప్లాన్ లో భాగంగా ఈ చిత్రాన్ని ఒక ప్రాపగాండా మూవీగా తెరకెక్కించారని ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని ఇతర పార్టీల నేతలు విమర్శించారు.

కేరళలో మహిళలని ట్రాప్ చేసి ముస్లింలు గా కన్వెర్ట్ చేసి ఆ తర్వాత బలవంతంగా ఉగ్రవాద సంస్థలకు తరలించే దారుణమైన చర్య చాలా కాలంగా జరుగుతోందనే అంశంతో దర్శకుడు సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇది ఒక ప్రాపగాండా చిత్రం మాత్రమే అని ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని కేరళ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

ఇది కేవలం బిజెపి కుట్ర మాత్రమే అని విమర్శిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి కొన్ని వర్గాల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. ఈ చిత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకం తప్ప మతానికి కాదని చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతూనే ఉంది. 

అయితే ఈ చిత్రంపై గత ఏడాది కశ్మీర్ ఫైల్స్ తో ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కేరళ స్టోరీ చిత్రంపై, చిత్ర యూనిట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టోరీ చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్. కానీ  న్యూస్ కూడా. మీ జీవితాలు ఇక మునుపటిలా ఉండవు. మీపై ఓ వర్గం నుంచి తీవ్రమైన హేట్, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. 

మిమ్మల్ని హింసించే దిశగా మీ పై కామెంట్స్, విమర్శలు మొదలవుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నేను గొప్ప దర్శకులని, నటీనటుల్ని, విమర్శకులని చూస్తూ పెరిగాను. సమయంలో వాస్తవాలని వక్రీకరించి  సినిమాపై విరుచుకుపడే వారిని కూడా చూశాను అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. కశ్మీర్ పైల్స్ చిత్రంతో వివేక్ ఏస్థాయిలో ప్రశంసలు అందుకున్నారో అదే స్థాయిలో కొందరు ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వివేక్ అగ్నిహోత్రి కేరళ స్టోరీస్ చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తూ సుదీర్ఘమైన లేఖని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్