నా వల్ల ఏ అమ్మాయి చనిపోలేదు.. 2005లో వచ్చిన రూమర్ పై నవదీప్ క్లారిటీ..

By Asianet News  |  First Published May 6, 2023, 4:19 PM IST

టాలీవుడ్ నటుడు నవదీప్ (Navdeep)పై గతంలో చాలా రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా నవదీప్ స్పందించారు. తన వెర్షన్ ను చెప్పుకు రావడం నెట్టింట వైరల్ గా మారింది.


హీరో నవదీప్ - బిందు మాధవి జంటగా Newsenseతో అలరించబోతున్నారు. తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’, ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీసే ‘న్యూసెన్స్’. ప్రస్తుతానికి ఈ సిరీస్ కు సంబంధించి  సీజన్ 1 మే 12, 2023న ఆహాలో ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారు. ఈ సందర్బంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 

అయితే,  నవదీప్ పై 15 కింద కొన్ని రూమర్లు వచ్చాయి. మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలపై తాజాగా స్పందించారు. ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అప్పటి రూమర్లకు బదులిచ్చారు నవదీప్... మీ వల్ల ఓ అమ్మాయి చనిపోయింది? మీరు గేనా? రేవ్ పార్టీ నిర్వహించారా? అని ప్రశ్నించారు. అప్పట్లో వీటిపైనే నవదీప్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు. 

Latest Videos

నవదీప్ మాట్లాడుతూ.. ‘నా వల్ల ఏ అమ్మాయి చనిపోలేదు. అప్పట్లో 2005లో ఆ ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఓ ప్రింట్ మీడియాలో ప్రచురితమైంది. అదంతా అబద్ధం. అలాగే నేను ‘గే’ అనడం అబద్ధమే. అలాగే  రేవ్ పార్టీ నిర్వహించామంటూ  వచ్చిన రూమర్లు కూడా అబద్ధమే. అందుకు మా అమ్మగారే సాక్ష్యం.  ఆరోజే మా ఫామ్ లో ఫ్యామిలీ అందరం కలిసి డిన్నర్ చేశాం. ఆ తెల్లరి ఈ వార్త వచ్చింది. మా అమ్మగారు కూడా అడిగారు. నిన్న మనం ఫామ్ కు వెళ్లిన విషయాన్నే రేవ్ పార్టీ అని అంటున్నారని చెప్పారు. అప్పటి నుంచి మా అమ్మ అలాంటి రూమర్లను పట్టించుకోవడం మానేశారు.’ అంటూ చెప్పుకొచ్చారు. 

సిరీస్ మీడియా పరిశ్రమకు సంబంధించిన అన్వేషణగా ఉంటుందని మేకర్స్ హామీ తెలిపారు. సిరీస్ ను శ్రీ ప్రవీన్ కుమార్ రూపొందించారు. ఆయనే దర్శకత్వం వహించారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఆర్‌కె సినీప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. మీడియా గురించి ప్రజల మనసుల్లో కొత్త దృక్పథాన్ని సృష్టించే న్యూసెన్స్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని నవదీప్ అన్నారు. ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పథాన్ని కలిగించే కంటెంట్‌ను అభివృద్ధి చేయడం నటీనటుల బాధ్యత అని బిందు మాధవి పేర్కొన్నారు.

click me!