విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రివ్యూ: అరుదైన వ్యాధి సోకిన అఘోరా, విజువల్స్ అదుర్స్!

Published : Feb 29, 2024, 08:02 PM IST
విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రివ్యూ: అరుదైన వ్యాధి సోకిన అఘోరా, విజువల్స్ అదుర్స్!

సారాంశం

హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గామి. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల కాగా ఆసక్తి రేపుతోంది. అద్భుతమైన విజువల్స్, సస్పెన్సు అంశాలతో మెప్పించింది...   

ప్రయోగాలు చేస్తున్నా విశ్వక్ సేన్ కి విజయాలు దక్కడం లేదు. ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈసారి ఆయన ఓ భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నాడు. అఘోర పాత్రలో అలరించనున్నాడు. అఘోరగా విశ్వక్ సేన్ లుక్ మెప్పిస్తుంది. దాదాపు నాలుగు నిమిషాల సుదీర్ఘ ట్రైలర్ గూస్ బంప్స్ రేపింది. విశ్వక్ సేన్ అరుదైన వ్యాధితో బాధపడే అఘోర. ఆయన వ్యాధికి పరిష్కారం హిమాలయాల్లో ఉంటుంది. 36 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూసే పూల కోసం విశ్వక్ సేన్ ప్రయాణం మొదలుపెడతాడు. 

ఈ సాహస యాత్రలో సహకారం అందించే అమ్మాయిగా చాందిని చౌదరి పాత్ర ఉంది. విజువల్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ మూవీని గామి ట్రైలర్ తలపించింది. సైన్స్ ఎక్స్పరిమెంట్స్, దేవదాసి వంటి మూఢాచారాలు కథలో జోడించారు. అసలు విశ్వక్ సేన్ ఎవరు? అనేది కథలో ట్విస్ట్. మొత్తంగా గామి ట్రైలర్ మెప్పించింది. 

గామి మార్చి 8న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. గామి చిత్రాన్ని కొత్త దర్శకుడు  విద్యాధర్  కాగిత తెరకెక్కించారు. యంగ్ డైరెక్టర్ ఓ భిన్నమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.గామి చిత్రానికి సంతోష్ కుమరన్ సంగీతం అందిస్తున్నారు. కాగా నెక్స్ట్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించనున్నాడు. ఈ పీరియాడిక్ విలేజ్ డ్రామా సైతం విడుదలకు సిద్ధం అవుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్