
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే తెలుగు సినీమా పరిశ్రమలో.. ఎందరో మహానుభావులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పోయిన ఏడాది ఎక్కువగా సినీపరిశ్రమకు చెందిన గొప్పవారు కాలం చేశారు. ఈ ఏడాది కూడా అది కంటీన్యూ అవుతుంది. ఇప్పటికే ఈరెండు నెల్లలో చాలా మంది సినిమా ఇండస్ట్రీ వారు కన్నుమూశారు. తాజాగా టాలీవుడ్ సింగర్ శ్రీనివాస్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.
టాలీవుడ్ లో దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్ గా ఎన్నో జానపద గీతాలు ఆలపించిన వడ్డేపల్లి శ్రీనివాస్ కన్ను మూశారు. ఆయన సినిమాల్లో కూడా మంచి మంచి పాటలు పాడారు.మరీ ముఖ్యంగా 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి పిల్ల..’ సాంగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ పాటకి ఆయన ఫిలింఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ పాటతో శ్రీనివాస్ కు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అయితే చాలా కాలంగా ఆయన్ను అనారోగ్యం ఇబ్బందిపెడుతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం మరణించారు. దీంతో సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇస్తున్నారు.