కె.విశ్వనాథ్ బయోపిక్ 'విశ్వ దర్శనం' టీజర్..!

Published : Feb 19, 2019, 10:00 AM IST
కె.విశ్వనాథ్ బయోపిక్ 'విశ్వ దర్శనం' టీజర్..!

సారాంశం

కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా రూపొందిస్తోన్న చిత్రం 'విశ్వ దర్శనం'.. జనార్ధన్ మహర్షి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ మంగళవారం నాడు విడుదల చేశారు.

కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా రూపొందిస్తోన్న చిత్రం 'విశ్వ దర్శనం'.. జనార్ధన్ మహర్షి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ మంగళవారం నాడు విడుదల చేశారు. 'వందేళ్ల వెండితెర చెబుతున్న తొంబై ఏళ్ల బంగారు దర్శకుడి కథ' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

ప్రముఖ గాయని సుశీల, నటి రాధికా శరత్ కుమార్, భానుప్రియ, ఆమని, సింగర్ శైలజ, విజయేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి ఇలా ఒక్కొక్కరూ విశ్వనాథ్ గారి గొప్పతనం గురించి చెబుతుంటారు. మధ్య మధ్యలో విశ్వనాథ్ కి సంబంధించిన అలనాటి ఫోటోలను టీజర్ లో చూపిస్తూ ఉన్నారు.

చివరిగా.. ''నేను సినిమా అనే ఓ బస్సుని పట్టుకొని, సినిమా చూసే ప్రేక్షకులను భక్తులు అనుకుని నేను బస్సు నడిపే డ్రైవర్ ని.. ఏం చేయాలి నేను..?' అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్