సిని ప్రపంచంలో ఫ్లాప్ అనేది చాలా దారుణమైన పరిస్దితులను క్రియేట్ చేస్తుంది. ఒక్క రోజులో లైఫ్ టర్న్ చేసేస్తుంది. ఇప్పుడు అదే పరిస్దితి ప్రియా ప్రకాష్ వారియర్ కు ఎదురైందని సమాచారం.
సిని ప్రపంచంలో ఫ్లాప్ అనేది చాలా దారుణమైన పరిస్దితులను క్రియేట్ చేస్తుంది. ఒక్క రోజులో లైఫ్ టర్న్ చేసేస్తుంది. ఇప్పుడు అదే పరిస్దితి ప్రియా ప్రకాష్ వారియర్ కు ఎదురైందని సమాచారం. కన్ను కొట్టి కుర్రాళ్ల హృదయాలను దోచేసుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా వెలిగిపోతుందని ఆమెతో పాటు అందరూ ఆశించారు.
ఏడాది క్రితం కరిలీజైన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్ ఓ సెన్సేషన్ అయ్యినప్పుడు మీడియా మొత్తం ఆమె గుమ్మం ముందే ఉంది. ప్రియా కన్ను కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో నిర్మాతలు క్యూ కట్టారు. ముఖ్యంగా మన తెలుగోళ్లకు ఆమె గ నచ్చేసింది. కొంతమంది నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా అడిగారు కూడా. అయితే అత్యుత్సాహంతో రెమ్యునేషన్ కోటి కోట్ చేయటంతో అడ్వాన్స్ లు రాలేదు. ఆమె తన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయింది.
ఈ లోగా ‘లవర్స్ డే’రిలీజ్ అయ్యి.... డిజాస్టర్ అయ్యింది. ఆమెను ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా అడిగేవాళ్లే లేరు. కానీ కొందరు దర్శక,నిర్మాతలకు ఇంకా భ్రమ పోలేదు. ఓ స్టార్ డైరక్టర్ తమ తదుపరి చిత్రంలో ఆమెకు హీరోయిన్ ప్రెండ్ పాత్రకు అడిగారట. ఆమె నో చెప్పింది. ఆ షాక్ నుంచి ఆమె కోలుకునేలోగా మరొకరు హీరో చెల్లెలు పాత్ర చేస్తావా , సినిమాలో అది కీ రోల్ అని కలిసారట. దాంతో ప్రియా ప్రకాష్ వారియర్ కు ఏం చెప్పాలో తోచలేదట. పెద్ద బ్యానర్, స్టార్ హీరో ...చూస్తే చెల్లెలు పాత్ర. అదీ ఇప్పుడు ప్రియ పరిస్దితి.
రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఈ నెల 14న పేమికుల దినోత్సవం రోజున విడుదల అయ్యింది. ప్రియా ప్రకాష్ కు పెద్ద మార్కులు పడలేదు. క్యూట్ గా ఉంది కానీ నటన అంతంత మాత్రమే అని తేల్చేరు.