బోయపాటికి అంత సీన్ ఇవ్వడం లేదా..?

Published : Feb 19, 2019, 09:37 AM IST
బోయపాటికి అంత సీన్ ఇవ్వడం లేదా..?

సారాంశం

దర్శకుడు బోయపాటి శ్రీను భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సాధారణ కథను కూడా భారీ స్థాయిలో చెప్పడం అతడికి అలవాటు. దానికోసం నిర్మాతలతో కోట్ల రూపాయలను ఖర్చు చేయిస్తుంటాడు. 

దర్శకుడు బోయపాటి శ్రీను భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సాధారణ కథను కూడా భారీ స్థాయిలో చెప్పడం అతడికి అలవాటు. దానికోసం నిర్మాతలతో కోట్ల రూపాయలను ఖర్చు చేయిస్తుంటాడు. అతడిపై నమ్మకంతో నిర్మాతలు కూడా కాదనేవారు కాదు.

కానీ ఇప్పుడు సీన్ మారింది. 'వినయ విధేయ రామ' సినిమా రిజల్ట్ బోయపాటిపై చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది. సినిమా మేకింగ్ కోసంభారీగా ఖర్చు పెట్టించాడు. కానీ సినిమా నష్టాలనే మిగిల్చింది. ఇంతకాలం బోయపాటి చెప్పినట్లు వినే నిర్మాతలు ఇప్పుడు అతడికి అంత సీన్ ఇవ్వడం లేదని టాక్.

బాలకృష్ణ సినిమా కోసం రూ.70 కోట్ల బడ్జెట్ అడిగాడట బోయపాటి. అందులో ఇరవై కోట్లు యాక్షన్ సీన్స్కోసమే ఖర్చు పెట్టాలని అనుకున్నాడు. అయితే దానికి బాలకృష్ణ  అంగీకరించలేదని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకున్నా తమ సినిమా బిజినెస్ యాభై కోట్ల రేంజ్ లో ఉంటుందని.. అంతలోనే సినిమాను పూర్తి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఆ బడ్జెట్ కి తగ్గట్లుగా బోయపాటి తన ప్లాన్ వేసుకోవాల్సి వస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఓకే.. లేదంటే బోయపాటి పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయం. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు