చిరంజీవి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ‘విశ్వంభర’ సినిమాలో ఉంటాయి. నేనూ ఆయన ఫ్యానే. ఈ చిత్రంలో పాత చిరంజీవి కనిపిస్తారు.
ఒకవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో చిరంజీవి ‘విశ్వంభర’ స్పీడుగా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ రేంజిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటితోపాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మరింత నాణ్యతకోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రోజు టీజర్ రావటం లేదు.
మీడియా వర్గాల నుంచి అందుతన్న సమాచారం మేరకు ఒక నిమిషం లెంగ్త్ గల టీజర్‌ని చిత్ర టీమ్ కట్ చేసింది. చిరు పుట్టిన రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే పుట్టిన రోజున చిరు ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రాలు రీ రిలీజుకు రెడీ అయ్యాయి. ఈ హంగామా మధ్య ‘విశ్వంభర’ టీజర్ విడుదల చేయడం మంచిది కాదని చిరు ‘నో’ చెప్పారని తెలుస్తోంది. ‘ఇంద్ర’ సినిమాకు టీజర్ కలుపుతారనే ఫ్యాన్స్ ఆశలు దాంతో గల్లంతయ్యాయి.
డైరక్టర్ ఈ విషయమై మాట్లాడుతూ...‘‘ గురువారం టీజర్ విడుదలవుతుందని పలు సినీ వెబ్‌సైట్లలో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అది ఓ రకంగా సినిమా ప్రమోషన్‌కు మంచిదే (నవ్వుతూ). మేం ప్లాన్ ప్రకారం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ మేరకు త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం. గురువారం విడుదల చేయట్లేదు.’’ అని తెలిపారు.
అలాగే చిరంజీవి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ‘విశ్వంభర’ సినిమాలో ఉంటాయి. నేనూ ఆయన ఫ్యానే. ఈ చిత్రంలో పాత చిరంజీవి కనిపిస్తారు. నమ్మకంగా చెబుతున్నా.. ఈ మూవీ సూపర్‌హిట్ అవుతుంది. కాన్సెప్ట్ పరంగా ‘విశ్వంభర’ పేరు ఎక్కువ సన్నివేశాలతో ముడిపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ సీన్ ఆయనకు వినిపించగా ‘విశ్వంభర ఏంటి? టైటిలా’ అని అడిగారు. అవును అదే అనుకుంటున్నామని చెప్పగా.. చాలా బాగుందన్నారు అని చెప్పుకొచ్చారు.
అయినా ‘విశ్వంభర’ సినిమాకు ఇంకా చాలా టైమ్ ఉంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. వినాయక చవితికి టీజర్ విడుదల చేసి, అప్పట్నుంచి సాంగ్స్ కూడా ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉంది చిత్ర టీమ్. ఈ సినిమాలో కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపించనున్నారు.