చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు ప్రాణ దానం చేశారు

చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు. రామ్ చరణ్ సార్ భార్యదే అపోలో హాస్పిటల్. ఆమె ద్వారానే నాకు వైద్యం అందింది



చిరంజీవి దాతృత్వం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే వెంటనే స్పందించి మాగ్జిమం సాయిం చేస్తారు. అలా నటుడు పొన్నంబలం (Ponnambalam)కు ప్రాణం పోసి జీవితాన్ని ఇచ్చారు. విలన్‌గా తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పొన్నంబలం.. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు  విలన్ గా నటించారు. తెలుగులోనూ ఈయన పాపులారిటీ మామూలుగా లేదు. 1990 కాలం నుంచే తెలుగులో పొన్నంబలం విలన్‌గా రాణించారు. ఆయన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా తనదైన నటన, శైలితో ఆకట్టుకునేవారు. చిరంజీవి (Chiranjeevi), నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో ఫైట్స్ చేసి యాక్షన్ సీన్స్ లో కనపడేవారు. 

మూడేళ్ల క్రితం పొన్నంబలం కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీల సాయం కోరారు పొన్నంబలం. వైద్యానికి సరిపడా డబ్బులు తన దగ్గర లేకపోవడంతో సాయం చేయాలని అర్థించారు. ఆయనకి సాయం చేయడానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి చాలా మంది ముందుకొచ్చారు. అలా సాయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.

Latest Videos

తన స్నేహితుడి ద్వారా చిరంజీవి ఫోన్ నంబర్ సంపాదించిన పొన్నంబలం.. ఆయనకు ఒక మెసేజ్ చేశారట. ‘అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి’ అని మెసేజ్ పెట్టారట. మెసేజ్ చేసిన పది నిమిషాల తర్వాత పొన్నంబలానికి చిరంజీవి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని పొన్నంబలం స్వయంగా వెల్లడించారు. చిరంజీవి తనకు చేసిన సాయం గురించి  వివరంగా చెప్పారు పొన్నంబలం. చిరంజీవి బర్త్‌డే వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పొన్నాంబళం మాట్లాడారు. 

పొన్నాంబలం మాట్లాడుతూ... ‘‘నేను ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. ఘరానా మొగుడు హిట్ అవకపోతే నేను ఇండస్ట్రీ వదిలేస్తాను అని అప్పుడు చెప్పాను. 1985- 86 రోజుల్లో మాకు పారితోషికం రోజుకు రూ.350 ఇచ్చేవారు. చిరంజీవి సినిమా షూటింగ్‌ ఉన్నప్పుడు మాత్రం ఫైటర్స్‌కి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయిలు చొప్పున ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి చిరంజీవి ఇప్పటివరకు రూ.60 లక్షలకు పైనే ఖర్చు చేశారు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవి గారి చలవే. ఈ జీవితం ఆయన ఇచ్చిందే’’ అని పొన్నాంబళం పేర్కొన్నారు. 

చిరంజీవి గారికి నా విషయం తెలియగానే ‘‘హాయ్ పొన్నంబలం.. ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగాలేదా.. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా.. నేను ఉన్నాను, కంగారుపడకు.. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అని చిరంజీవి నన్ను అడిగారు. నేను రాలేను అన్నయ్య అని చెప్పాను. అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు. అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు. రామ్ చరణ్ సార్ భార్యదే అపోలో హాస్పిటల్. ఆమె ద్వారానే నాకు వైద్యం అందింది’’ అని పొన్నంబలం భావోద్వేగానికి గురయ్యారు.

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు తాను నమ్ముకున్నవాళ్లెవరూ సాయం చేయలేదని పొన్నాంబళం పేర్కొన్నారు. చిరంజీవి వల్లే తాను ప్రాణాలతో ఉన్నానన్నారు. చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన ఘ‌రానా మొగుడు, ముగ్గురు మొన‌గాళ్లు త‌దిత‌ర చిత్రాల్లో పొన్నాంబళం విలన్  పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.  
 

click me!