యంగ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). మార్చిలోనే విడుదల కానుందీ చిత్రం. చిత్ర యూనిట్ తాజాగా మరో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఓవైపు హీరోగా మెప్పిస్తూనే మరోవైపు దర్శకుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఇప్పటికే ఆయన దర్శకత్వం లో వచ్చిన ‘ఫలక్ నూమా దాస్’ మంచి క్రేజ్ ను సాధించి పెట్టిన విషయం తెలిసిందే. ఈచిత్రంతోనే యూత్ లో విశ్వక్ కు మంచి ఫాలోయింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా విశ్వక్ సేన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మరో చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈచిత్రంలో విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి నటించడం విశేషం. తన తండ్రి కరాటే రాజు నిర్మాతగా వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఫిబ్రవరి 17నే విడుదల కావాల్సింది వాయిదాపడింది. కొంత సీజీ వర్క్ పెండింగ్ లో ఉండటంతో సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇక తాజాగా కొత్త డేట్ ను ఫిక్స్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లు, పాటలతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మాస్, యాక్షన్, ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలోని ‘ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా’, ‘మావా బ్రో’ సాంగ్స్ కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు రోటీన్ కు భిన్నంగా విశ్వక్ సేన్ సినిమాలు చేస్తుండటం విశేషం. చివరిగా ‘ఓరి దేవుడా!’తో అలరించగా.. ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’తో దుమ్ములేపనున్నారు.