కావాలనే కెజిఎఫ్ 2 ని తిట్టిన వెంకటేష్ మహ...  బయటపడ్డ షాకింగ్ నిజాలు!

Published : Mar 09, 2023, 03:11 PM IST
కావాలనే కెజిఎఫ్ 2 ని తిట్టిన వెంకటేష్ మహ...  బయటపడ్డ షాకింగ్ నిజాలు!

సారాంశం

దర్శకుడు వెంకటేష్ మహ ఓ ఇంటర్వ్యూలో కెజిఎఫ్ 2 చిత్రాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వాఖ్యలు చేశారు. నీచ్ కమీన్ కుత్తే అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే వెంకటేష్ మహ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు.   

కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహ కెజిఎఫ్ 2 చిత్రాన్ని కించపరుస్తూ మాట్లాడటం తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. దేశవ్యాప్తంగా ఉన్న కెజిఎఫ్ చిత్ర అభిమానులు వెంకటేష్ మహను ఏకి పారేశారు. వెంకటేష్ మహ అనుచిత కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ నవ్విన నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, మోహన కృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణ సైతం విమర్శలకు గురయ్యారు. సోషల్ మీడియా ట్రోల్స్ తట్టుకోలేక తప్పైపోయింది క్షమించండని ఆ డైరెక్టర్స్ వేడుకున్నారు. 

వివాదానికి అసలు కారకుడైన వెంకటేష్ మహ మాత్రం క్షమాపణలు చెబుతూనే తన కామెంట్స్ సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. నేను వాడిన భాషకు మాత్రమే క్షమాపణ భావానికి కాదు. కెజిఎఫ్ చిత్రం మీద నా అభిప్రాయానికి కట్టుబడే ఉంటానని ఆయన చెప్పారు. పబ్లిక్ లో ఒక ప్రజాదరణ పొందిన చిత్రాన్ని దూషిస్తే వివాదమవుతుందని వెంకటేష్ మహకు తెలియనిది కాదు... దీని వెనుక స్కెచ్ ఉందని. కావాలనే వెంకటేష్ మహ కామెంట్స్ చేశారంటున్నారు. 

కెజిఎఫ్ 2 పై ఆయన వెళ్లగక్కిన అక్కసు ఎమోషన్ కాదని కొందరు అంటున్నారు. ఒక ప్రయోజనం ఆశించి చేశారంటున్నారు. 'యాంగర్ టేల్స్' టైటిల్ తో తెరకెక్కిన ఆంథాలజీ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 9 నుండి స్ట్రీమ్ అవుతుంది. నాలుగు ఎపిసోడ్ల ఈ సిరీస్ కి ప్రభల తిలక్ దర్శకుడు. ఈ ఆంథాలజీ సిరీస్లో వెంకటేష్ మహ నటించారు. ఈ సిరీస్ కి ప్రచారం దక్కించుకోవడానికి కెజిఎఫ్ చిత్రం మీద ఇలాంటి కామెంట్స్ చేశాడని కొందరి వాదన. 

ఈ మేరకు నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. వెంకటేష్ మహ 'యాంగర్ టేల్స్' సిరీస్లో తన ఎపిసోడ్ భూతులతో నిండి ఉంటుంది. 18 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలి. పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ  ట్వీట్ చేశాడు. యాంకర్ టేల్స్ లో తన పాత్ర బూతులు మాట్లాడుతుందని చెప్పిన వెంకటేష్ మహ... ప్రచారం కోసమే కెజిఎఫ్ చిత్రాన్ని తిట్టాడంటున్నారు. యాంగర్ టేల్స్ సిరీస్ కి ప్రచారం తెచ్చుకోవడం కోసం ఇలా చేశాడని, తాను కోరుకున్న దానికంటే అధిక ప్రచారం దక్కిందని అంటున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:ప్రూఫ్స్ మాయం చేసిన కాశీ-జైల్లోనే శ్రీధర్-కార్తీక్‌కి షాకిచ్చిన తాత
Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు