కొత్త సినిమా స్టార్ట్ చేసిన కిరణ్‌ అబ్బవరం.. స్టోరీ, షూటింగ్‌ డిటెయిల్స్

Published : Mar 09, 2023, 03:17 PM IST
కొత్త సినిమా స్టార్ట్ చేసిన కిరణ్‌ అబ్బవరం.. స్టోరీ, షూటింగ్‌ డిటెయిల్స్

సారాంశం

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం సినిమాల విషయంలో జోరు పెంచుతున్నారు. ఇటీవలే `వినరో భాగ్యము విష్ణుకథ` చిత్రంతో సక్సెస్‌ అందుకున్న ఆయన ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. వరుస పరాజయాల అనంతరం ఇటీవల `వినరో భాగ్యము విష్ణుకథ` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. హీరోగా ఆయన్ని మరో మెట్టు ఎక్కించిందీ చిత్రం. దీంతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం `మీటర్‌` సినిమాతో తన హీరోగా మీటర్‌ పెంచుకునే పనిలో పడ్డారు. దీంతోపాటు మరో సినిమాలో నటిస్తున్నాడు కిరణ్‌ అబ్బవరం. తాజాగా కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. 

కిరణ్‌ అబ్బవరం.. విశ్వకరుణ్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. తనకిది 9వ సినిమా కావడం విశేషం. శివం సెల్యులాయిడ్స్ పతాకంపై రవి, జోజో జోస్‌, రాకేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సరికొత్త లవ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది.  హీరోపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టగా, ప్ర‌ముఖ నిర్మాత‌లు ద‌గ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.ర‌త్నం కెమెరా స్విచాన్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి నిర్మాత‌లు కె.ఎస్.రామారావు, జెమిని కిర‌ణ్‌, శిరీష్, వ‌ల్ల‌భ‌నేని వంశీ, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోద‌ర‌ప్ర‌సాద్, కె.కె.రాధామోహ‌న్, బెక్కెం వేణుగోపాల్, ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌ త‌దిత‌రులు అతిథులుగా హాజ‌రై సినిమా విజ‌యం సాధించాల‌ని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈనెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు. 

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి 
నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్, రాకేష్ రెడ్డి
స‌హ నిర్మాత‌లు: బి.సురేష్ రెడ్డి, సంతోష్ 
ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క‌రుణ్  
సంగీతం: సామ్ సిఎస్ 
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: ర‌వీంద‌ర్ 
డీఓపీ: విశ్వాస్ డానియేల్ 
ఎడిట‌ర్: ప్ర‌వీణ్ కె.ఎల్
అసిస్టెంట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సుధీర్ మాచ‌ర్ల‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్: హ‌ర్ష చ‌ల్ల‌ప‌ల్లి
పీఆర్వో: దుద్ది శ్రీను, సిద్ధు
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్