‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విశ్వక్ సేన్ కేరీర్ లోనే బెస్ట్ వసూళ్లు? ఎంతంటే..

By Asianet News  |  First Published Mar 23, 2023, 11:58 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా ‘దాస్ కా దమ్కీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
 


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen)  తాజాగా నటించిన చిత్రం Das Ka Dhamki. ఉగాది సందర్భంగా మార్చి 22న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. రెండో సారి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి నటించిన ‘దాస్ కా ధమ్కీ’ బాక్సాఫీస్ వద్ద కూడా డే1 ఓపెన్సింగ్స్ భారీగానే అందినట్టు తెలుస్తోంది. తొలిరోజే సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటున్నట్టు డ్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ లెక్కల ప్రకారం.. దాస్ కా ధమ్కీ చిత్రం విశ్వక్ కేరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ను సాధించిందని అభిప్రాయపడుతున్నారు. 

చివరిగా విడుదలైన ‘ఓరి దేవుడా’ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.2 కోట్ల గ్రాస్ వచ్చింది. అంతకు ముందే వచ్చిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం‘ కేవలం రూ.1.8 కోట్ల గ్రాస్ ను మాత్రమే తొలిరోజు కలెక్ట్ చేసిందని.. కానీ దాస్ కా ధమ్కీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టిందంటున్నారు. రూ.4 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసి ఉంటుందదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో 440 థియేటర్లు, ఓవర్సీస్, మిగితా ఏరియాల్లో 210 కలుపుకొని.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 650 థియేటర్లలో విడుదలైందని తెలుస్తోంది. 40 శాతం ఆక్యుపెన్సీతో ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద గుడ్ స్టార్ట్ అయ్యింది.

Latest Videos

ఇక  ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే... నైజాంలో రూ.2.9 కోట్లు, సీడెడ్ లో రూ. కోటీ, ఏపీలో రూ.2.9 కోట్లు, ఆంధ్ర + తెలంగాణలో రూ.6.80 కోట్లు, కర్ణాటక, ఓవర్సీస్, మిగితా ఏరియాల్లో రూ.0.80 కోట్ల వరకు బిజినెస్ జరిగిందంట. ఇలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.50 కోట్ల బిజినెస్ జరిగిందని, ప్రింట్స్, అడ్వైర్టైజ్ మెంట్లకు కలుపుకొని మొత్తంగా రూ.10 కోట్ల వరకు బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్లపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డే కలెక్షన్లను చూస్తుంటే వీకెండ్ లో మాత్రం మరింతగా వసూల్ చేసే అవకాశం ఉందంటున్నారు. 

‘ఫలక్ నూమా దాస్’ చిత్రం తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వం వహించడంతో పాటు నటించిన  చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా రూపుదిద్దుకుంది. ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేసినట్టుగానే ఆడియెన్స్ నుంచి మంచి టాక్ అందుకుంది. సినిమాలోని ట్విస్టులు, పాటలు, యాక్షన్, సెకండాఫ్ అదిరిపోయిందంటూ టాక్ వచ్చింది. దీంతో మున్ముందు మరింతగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ నివేతా పేతురాజ్ నటించారు. హైపర్ ఆది, మహేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

click me!