మంచులో కూరుకుపోయి పాప్ సింగర్ మృతి.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ని విమర్శిస్తూ పాడిన పాటతో క్రేజ్

By Asianet News  |  First Published Mar 23, 2023, 10:53 AM IST

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యువ గాయకుడు దిమా నోవా (34) దుర్మరణం చెందారు. అతి పిన్న వయసులోనే దిమా నోవా మరణించడంతో అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.


ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యువ గాయకుడు దిమా నోవా (34) దుర్మరణం చెందారు. అతి పిన్న వయసులోనే దిమా నోవా మరణించడంతో అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రష్యాకి చెందిన దిమా నోవా పాప్ సింగర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 

దిమా నోవా తన స్నేహితులతో కలసి ఈ నెల 19న ప్రోజన్ వోల్గా నది దాటుతూ ప్రమాదవశాత్తూ మంచులో కూరుకుపోయారు. దీనితో ఊపిరాడక డిమాం నోవా దుర్మరణం చెందారు. ఈ మేరకు రష్యా మీడియాలో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. 

Latest Videos

దిమా నోవా.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో వ్లాదిమర్ పుతిన్ ని విమర్శిస్తూ పాట పాడాడు. ఆ పాటతో దీమాకి వరల్డ్ వైడ్ గా మరింత గుర్తింపు లభించింది. దీమా నోవా పాప్ సింగర్ గా రాణిస్తూ క్రీమ్ సోడా అనే మ్యూజిక్ సంస్థని కూడా నడుపుతున్నాడు. ఈ కంపెనీలో పనిచేసే తన స్నేహితులతో కలసి వోల్గా నది దాటుతుండగా మంచులోపడిపోయారు. మంచులో బాగా కూరుకుపోవడంతో దీమా మరణించారు. అతడి స్నేహితులని రెస్క్యూ సిబ్బంది మంచు నుంచి బయటకి తీసి ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒక స్నేహితుడు మరణించగా మిగిలినవారు ప్రాణాపాయం నుంచి బయట పడ్డట్లు తెలుస్తోంది. 

దీమా నోవా మరణ వార్తని ధృవీకరిస్తూ క్రీం సోడా సంస్థ కూడా ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని నిరసిస్తూ దీమా.. ఆక్వా డిస్కో అనే పాట పాడారు. ఈ పాట అప్పట్లో వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచింది. దీమా మరణ వార్త తెలియగానే ఆయన అభిమానులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అతి పిన్నవయసులో మరణించడం జీర్ణించుకోలేని అంశం అంటూ సంతాపం తెలుపుతున్నారు. 

click me!