హిందీ ‘టెంపర్’చూసిన విశాల్...ఏం చేస్తున్నాడో తెలుసా? !

Published : Jan 04, 2019, 02:12 PM IST
హిందీ ‘టెంపర్’చూసిన విశాల్...ఏం చేస్తున్నాడో తెలుసా? !

సారాంశం

ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. వరస ఫెయిల్యూర్స్ ఉన్న ఎన్టీఆర్ కెరీర్ ని ఈ  సినిమా  హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా అని తెలిసిన విషయమే. 

ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. వరస ఫెయిల్యూర్స్ ఉన్న ఎన్టీఆర్ కెరీర్ ని ఈ  సినిమా  హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా అని తెలిసిన విషయమే. ఇప్పుడీ చిత్రం హిందీలో సింబా టైటిల్ తో రణ్వీర్ సింగ్ హీరోగా రిలీజయ్యింది. సెంటిమెంట్ తో కూడిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా   హిందీలో సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం  ఈ చిత్రం రూ.125 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి.. ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే..టెంపర్ సినిమాని  తమిళంలోనూ  రీమేక్  చేస్తున్నారు. విశాల్ , రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ ‘అయోగ్య’.ఇక రీసెంట్ గా హిందీ వెర్షన్ చూసిన విశాల్...వాళ్లు చేసిన మార్పులకు ఫిదా అయ్యిపోయాడట. దాంతో దర్శకుడుతో ఆ మార్పులను తన చిత్రంలోనూ పెట్టమని ఫోర్స్ చేస్తున్నట్లు తమిళ సినిమా వర్గాల కథనం. అయితే ఇప్పటికిప్పుడు  స్క్రీన్ ప్లే మార్చాలంటే చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని..మొదట అనుకున్నట్లుగా యాజటీజ్ వెళ్లిపోదామని, దర్శక,నిర్మాతలు కోరుతున్నారని చెప్తున్నారు. 

అలా చేస్తే తెలుగు మరియు హిందీ లాగే తమిళ్ లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. హిందీలో హిట్ అవటంతో ‘అయోగ్య’పై ఇంకా నమ్మకం పెరిగింది. బిజినెస్ ఊపందుకుందిట. తమిళ వెర్షన్ ని సైతం కొద్ది పాటి మార్పులతో  పూర్తి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను మలుస్తున్నారట. 

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే