ఆ హీరోల ఇళ్లల్లో దాడులు.. కిలోల కొద్దీ బంగారం!

Published : Jan 04, 2019, 01:06 PM IST
ఆ హీరోల ఇళ్లల్లో దాడులు.. కిలోల కొద్దీ బంగారం!

సారాంశం

కన్నడ సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోలు శివరాజ్ కుమార్, ఆయన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, హీరో యష్, కిచ్చా సుదీప్ ఇలా చాలా మంది ఇళ్లపై దాడులు జరిపారు.

కన్నడ సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోలు శివరాజ్ కుమార్, ఆయన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, హీరో యష్, కిచ్చా సుదీప్ ఇలా చాలా మంది ఇళ్లపై దాడులు జరిపారు.

ఈ క్రమంలో అధికారులకు కిలోల కొద్దీ బంగారం, నగదు దొరికినట్లు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో సోదాల సమయంలో భారీగా వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పునీత్ సమాధానాలు ఇచ్చారు. అలానే హీరో యష్ తో పాటు అతడి సోదరి, మామ ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

యష్ మామను అధికారులు రహస్య ప్రాంతానికి కారులో తీసుకెళ్లి మరీ విచారించినట్లు సమాచారం. ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో యష్ ముంబైలో ఉన్నారట. విషయం తెలుసుకొని వెంటనే బెంగుళూరుకి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ చట్టానికి తలొంచి తీరాల్సిందేనని తెలిపారు.

హీరో కిచ్చా సుదీప్ కూడా షూటింగ్ రద్దు చేసుకొని వచ్చి మీడియాతో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వ్యక్తిగత కక్షలతో ఎవరూ దాడి చేయడం లేదని.. కేవలం మూడు సినిమాలకు సంబంధించి మాత్రమే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరందరి ఇళ్లతో పాటు ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇళ్లపై కూడా దాడుకు జరిపి బంగారాన్ని, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.  

వెంకటేష్, రాధిక ఇళ్లపై ఐటీ దాడులు!

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది