కాజల్ నోరు జారేసింది..!

By Udayavani DhuliFirst Published Jan 4, 2019, 2:06 PM IST
Highlights

స్టార్ హీరోయిన్ కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా దర్శకుడు తేజ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా 'సీత' అనే పేరు అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 

స్టార్ హీరోయిన్ కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా దర్శకుడు తేజ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా 'సీత' అనే పేరు అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

కానీ ఇంతలోపే కాజల్ నోరు జారేసి సినిమా టైటిల్ ఇదేనంటూ కన్ఫర్మ్ చేసేసింది. తాజాగా తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన కాజల్ తన కొత్త సినిమాకు సీత అనే టైటిల్ ని పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు.. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కాదని, మార్చిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ప్రకటించింది.

గతంలో హీరోయిన్ సమంత కూడా 'అత్తారింటికి దారేది' సినిమా టైటిల్ ని ముందే లీక్ చేసింది. ఇప్పుడు కాజల్ కూడా అదే పని చేసింది. అయితే సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం ఈ బ్యూటీ బయటపెట్టలేదు.

తన పాత్ర మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరే టైటిల్ గా కూడా పెట్టినట్లు సమాచారం. 

click me!