Vishal: యాక్షన్ ట్రీట్ ఇస్తానంటున్న విశాల్.. పాన్ ఇండియాను టార్గెట్ చేసిన కోలీవుడ్ స్టార్

By Mahesh Jujjuri  |  First Published Jan 3, 2022, 12:09 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో.. తెలుగు కుర్రాడు విశాలో మరో యాక్షన్ ట్రీట్ కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ హీరోగా స్సెషల్ ఇమేజ్ సాధించిన విశాల్ ఈసారి డబుల్ యాక్షన్ ట్రీట్ ఇస్తాడంట.


విశాల్ కు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. అటు తమిళనాట కాకుండా.. ఇటు తెలుగులో కూడా విశాల్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. కరోనా టైమ్ లో కూడా అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి..షూటింగ్స్ చేసుకున్న స్టార్ హీరో రీసంట్ గా మల్టీ స్టారర్ మూవీ ఎనిమీతో.. ఆడియన్స్ ముందకు వచ్చాడు. వాడు వీడు రీమేక్ గా తెరకెక్కిన ఎనిమీ మూవీలో స్టార్ హీరో ఆర్య తో స్క్రీన్ శేర్ చేసుకున్న విశాల్.. ఎనిమీతో పర్వాలేదనిపించాడు.

విశాల్ కు తెలుగు మార్కెట్ లో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలు బాగా వర్కైట్ అవుతాయి. త్వరలో సామాన్యుడు అనే మరో మూవీతో రాబోతున్న విశాల్. కొత్తగా మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈనెల 26న సామాన్యుడు తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇక తన మార్క్ యాక్షన్ కంటెంట్ పుష్కలంగా ఉన్న మరో మూవీకి సైన్ చేశాడు విశాల్.

Latest Videos

అధిక్  రవిచంద్రన్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాకు మార్క్ ఆంటోని అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు టీమ్. రీసెంట్ గా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నాటు తుపాకి పట్టుకుని పక్కా తమిళ మాస్ క్యారెక్టర్ లో విశాల్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా  నెక్ట్స్ మన్త్  అంటే పిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేయబుతన్నట్టు పోస్టర్ లో తెలియ చేశారు టీమ్. ఈసినిమాతో విశాల్ ఫస్ట్ టైమ్ పాని ఇండియాకు వెళ్లబోతున్నారు.

టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళ స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు. ఇక విశాల్ కూడా ప్రస్తుతం చేయబోయే మార్క ఆంటోనీ మూవీని తెలుగు,తమిళ, మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎలాగో యాక్షన్ మూవీస్ ను తెలుగు ఆడియన్స్ ఇష్టపడతారు.. విశాల్ కు తెలుగు మార్కెట్ బాగా ఉంది. ఇటు తెలుగు నుంచి అన్ని భాషల్లో ప్రమోషన్ చేస్తే.. బాగా వర్కౌట్ అవుతుంది అని చూస్తున్నాడు విశాల్.

Also Read ; Ram Charan – Rana: ట్రిపుల్ ఆర్ ఓకే.. మరి డబుల్ ఆర్ సినిమా ఎప్పుడంటున్న ఫ్యాన్స్..?


కెరీర్ పరంగా 33వ సినిమాచేస్తున్నాడు విశాల్. ఇక ముందు కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి మార్క్ ఆంటోనీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో వర్కౌట్ అయితే.. భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ పుణ్యమా అని తమిళ హీరోలు కెరీర్ ను గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Also Read ;Akhanda fame Purna: ముద్దొస్తున్న బొద్దుగుమ్మ పూర్ణ అందాలు... మెరూన్ కలర్ డ్రెస్ మెరిసిన స్టన్నింగ్ బ్యూటీ!

click me!