వర్జిన్‌ అయితేనే హీరోయిన్‌గా ఛాన్స్ లుః షాకింగ్‌ విషయాలు వెల్లడించిన మహిమా చౌదరి

Published : Oct 18, 2021, 10:54 AM IST
వర్జిన్‌ అయితేనే హీరోయిన్‌గా ఛాన్స్ లుః షాకింగ్‌ విషయాలు వెల్లడించిన మహిమా చౌదరి

సారాంశం

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న మహిమా చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది. తన కెరీర్‌ తొలినాళ్ల అనుభవాలను పంచుకుంది. ఒకప్పుడు హీరోయిన్లని ఎంపిక చేసే విధానం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో తెలిపింది.

బాలీవుడ్‌ నటి మహిమా చౌదరీ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోయిన్‌ చిత్ర పరిశ్రమలోకి రావాలంటే వర్జిన్‌గా ఉండాలని కోరుకునేవారని, మొదటి ముద్దు అనుభవం లేని వారికే అవకాశాలుండేవని తెలిపింది. `పర్దేశ్‌` చిత్రంతో బాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యింది.  1997 నుంచి 2008 వరకు బాలీవుడ్‌లో అగ్ర నటిగా రాణించింది. 

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న Mahima Chaudhry తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది. తన కెరీర్‌ తొలినాళ్ల అనుభవాలను పంచుకుంది. ఒకప్పుడు హీరోయిన్లని ఎంపిక చేసే విధానం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో తెలిపింది. Virgin గా ఉండే అమ్మాయిలకే అవకాశాలుండేవని బోల్డ్ గా తెలిపింది. 

ఈ ఇంటర్వ్యూ లో మహిమా చౌదరీ మాట్లాడుతూ, బాలీవుడ్‌లో ఒకప్పుడు మొదటి ముద్దు అనుభవం లేని హీరోయిన్లకే అవకాశం ఇచ్చేవారు. ఎలాంటి రిలేషన్‌ షిప్‌ లేని అమ్మాయిలనే హీరోయిన్‌గా ఎంపిక చేసేవారు. ఒకవేళ నటికి పెళ్లి అయితే అంతటితో ఆమె కెరీర్‌ ముగిసిపోతుందని తెలిపింది. అది హీరోలకు కూడా డిఫరెంట్‌గా ఉండేది కాదని, అందరికి ఇలాంటి పరిస్థితే ఉండేదని తెలిపింది. 

also read: మంచు లక్ష్మీ దారుణంగా ట్రోలింగ్‌.. నెటిజన్లకి నటి దిమ్మతిరిగే కౌంటర్‌.. నెట్టింట వైరల్‌

ఇలాంటి పరిస్థితి కారణంగానే `ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌` చిత్ర సమయంలో ఆమిర్‌ ఖాన్‌కి పెళ్లి అయ్యిందనే విషయం ఎవరికీ తెలియదని, ఆయన కూడా తన మ్యారేజ్‌ విషయాన్ని రహస్యంగానే ఉంచారని తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో తమ పిల్లలను బయటకిగానీ, సినిమాల్లోగానీ చూపించేవారు కాదని, అంతేకాదు వయసుని కూడా రివీల్‌ చేసేవారు కాదని వెల్లడించింది. 

`పర్దేశ్‌` చిత్రంతో బాలీవుడ్‌లో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారిన మహిమా చౌదరీ `దాగ్‌ః ది ఫైర్‌`, `ప్యార్‌ కొయి ఖేల్‌ నహిన్‌`, `ధడ్కన్‌`, `కురుక్షేత్ర`, `లజ్జా`, `యే తేరా ఘర్‌ యే మేరా`, `ఓం జై జగదీష్‌`, `దిల్‌ హై తుమ్హారా`, `దొబారా`, `హోమ్‌ డెలివరీ` చిత్రాల్లో నటించి దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. మహిమా టెన్నీస్‌ ప్లేయర్‌ లియండర్‌ పేస్‌ తో డేటింగ్‌ చేసింది. కొన్నాళ్ల తర్వాత ఆయనకు బ్రేకప్‌ చెప్పి, నటుడు బాబీ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. 2006లో వీరి వివాహం జరగగా, 2013లో విడాకులు తీసుకున్నారు. 

also read: ఘాటుగా లిప్ లాక్ సీన్.. దారుణంగా ట్రోలింగ్, తన భర్తపై హీరోయిన్ కామెంట్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే