'మా' అధ్యక్షుడు Manchu Vishnu సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులందరితో కలసి తిరుమలకు వెళ్లారు. మోహన్ బాబు కూడా మంచు విష్ణు వెంట వెళ్లారు.
'మా' అధ్యక్షుడు Manchu Vishnu సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులందరితో కలసి తిరుమలకు వెళ్లారు. మోహన్ బాబు కూడా మంచు విష్ణు వెంట వెళ్లారు. విఐపి బ్రేక్ దర్శనంలో మంచు విష్ణు ప్యానల్ శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు విష్ణుతో పాటు అతడి సోదరి మంచు లక్ష్మి.. ప్యానల్ సభ్యులు బాబు మోహన్, శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆర్చుకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం మంచు విష్ణు, Mohan Babu ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. 'MAA'కి అధ్యక్షుడిగా విష్ణు ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు. 'మా' అధ్యక్ష పదవి అంటే సాధారణ విషయం కాదు. అది ఒక గౌరవప్రదమైన హోదా, బాధ్యత అని మోహన్ బాబు తెలిపారు.
undefined
విష్ణు మాట్లాడుతూ.. 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక అందరం కలసి స్వామివారిని దర్శించుకున్నాం. అందరి కృషి వల్లే విజయం సాధించాం. తన ప్యానల్ లో మెజారిటీ సభ్యులు విజయం సాధించినట్లు విష్ణు తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామాల గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Prakash Raj ప్యానల్ రాజీనామా చేసినట్లు నాకు మీడియా ద్వారానే తెలిసింది. అయితే వారి రాజీనామాలు నాకు ఇంకా అందలేదు. రాజీనామా లేఖలు వచ్చాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని విష్ణు పేర్కొన్నాడు.
Also Read: పవన్ ని కలిసిన ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు ? ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్!
విష్ణు ప్రకాష్ రాజ్ పై 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమితో మనస్తాపానికి గురైన ప్రకాష్ రాజ్ తాను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తెలుగువాడిని కాదనే కారణంతో సభ్యులు తనని ఓడించడం బాధగా ఉందన్నారు. అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానల్ మోహన్ బాబు దుర్భాషలు ఆడారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రకాష్ రాజ్ ప్యానల్ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అక్టోబర్ 10న ఉద్రిక్త పరిస్థితుల నడుమ మా ఎన్నికలు జరిగాయి. మా ఎన్నికలు జరిగిన విధానంపై తనకు అనుమానం ఉందంటూ ప్రకాష్ రాజ్..ఎన్నికల అధికారిని సిసి టివి ఫుటేజ్ అడిగారు. దీనికోసం ఆయన పోలీసులని సైతం ఆశ్రయించారు. దీనితో టాలీవుడ్ లో 'మా' వేడి ఇంకా చల్లారలేదు.