పవన్ ని కలిసిన ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు ? ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్!

pratap reddy   | Asianet News
Published : Oct 18, 2021, 09:14 AM IST
పవన్ ని కలిసిన ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు ? ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్!

సారాంశం

ఇద్దరు దర్శకులు Pawan Kalyan తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల పవన్ ని కలిసినట్లు టాక్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ ఆసక్తికరంగా మారుతోంది. అటు పాలిటిక్స్, ఇటు మూవీస్ బ్యాలన్స్ చేస్తున్న పవన్ వరుసగా సినిమాలకు ఓకె చెబుతున్నారు. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ లోపు వీలైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించే ప్రయత్నం చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం Bheemla Nayak, హరిహర వీరమల్లు చిత్రాల్లో పవన్ నటిస్తున్నాడు. అలాగే హరీష్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. 

ఇవి కాక మరో ఇద్దరు దర్శకులు Pawan Kalyan తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల పవన్ ని కలిసినట్లు టాక్. ఈ మేరకు ఇద్దరూ పవన్ కోసం అనుకున్న స్టోరీ లైన్ వివరించారట. 

అందుతున్న సమాచారం మేరకు Sekhar Kammula ఇంటెన్స్ గా సాగే పొలిటికల్ డ్రామాతో పవన్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథ పవన్ ఇమేజ్ కు బాగా సరిపోతుందని శేఖర్ కమ్ముల నమ్ముతున్నారట. ఈ కథలో పవన్ నటిస్తే మెసేజ్ బలంగా ప్రజల్లోకి వెళుతుందని.. అది పవన్ పొలిటికల్ కెరీర్ కు కూడా ఉపయోగపడుతుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నారు. 

ఇక Anil Ravipudi పవన్ కోసం అవుట్ అండ్ అవుట్ మాస్ స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్ తో వినోదాత్మక కథలని ఎలా డీల్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఓకె అయితే ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఖాయం అని అంటున్నారు. 

మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ రెండు చిత్రాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి లతో పవన్ కాంబినేషన్ అంటూ వస్తున్న వార్తలు ఇప్పటివి కాదు. గతంలో కూడా ఊహాగానాలు వినిపించాయి. 

శేఖర్ కమ్ముల ఫిదా, Love Story లాంటి సెన్సిబుల్ కథలతో పాటు లీడర్ లాంటి బలమైన సందేశం ఉన్న కథలని కూడా డీల్ చేయగలరు. ఇక అనిల్ రావిపూడి టాలీవుడ్ లో పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు ఇలా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్