“విక్రమ్ వేద”పరిస్దితి అంత దారుణమా... టిక్కెట్ రేట్లు తగ్గిస్తూ ప్రకటన

Published : Oct 08, 2022, 05:52 PM IST
 “విక్రమ్ వేద”పరిస్దితి అంత దారుణమా... టిక్కెట్ రేట్లు తగ్గిస్తూ ప్రకటన

సారాంశం

. 'విక్రమ్ - వేదా' తమిళంలో 2017 లో మాధవన్- విజయ్ సేతుపతిలతో హిట్టయిన 'విక్రమ్- వేదా' కి రీమేక్. అప్పట్లో దీని బడ్జెట్ 11 కోట్లకి 66 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ రీమేక్ కి 175 కోట్ల బడ్జెట్.  


అసలే హిందీ సినిమాల పరిస్దితి అంతంత మాత్రంగా ఉంది. ఎలాగో కష్టపడి బ్రహ్మాస్త్రం బయిటపడింది. లైగర్ డిజాస్టర్ అయ్యింది.  మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' కి పోటీగా హిందీ 'విక్రమ్ - వేదా' విడుదలైంది. ఇందులో సైఫలీ ఖాన్ - అమీర్ ఖాన్ లు మొదట నటించాల్సింది తర్వాత సైఫలీ ఖాన్ -ఆమీర్ ఖాన్ ల పేర్లు వినబడి, అమీర్ ఖాన్ కూడా తిరస్కరించడంతో ఆఖరికి సైఫలీఖాన్- హృతిక్ రోషన్ ల కాంబినేషన్లో తెరకెక్కింది. తమిళ దర్శకులు పుష్కర్- గాయత్రి లు  మణిరత్నం సినిమాతో పోటీ పడుతూ 'విక్రమ్ -వేదా' కమర్షియల్ మాస్ తో ముందుకొచ్చారు. 

హిందీ ప్రేక్షకులకి కావాల్సింది మాస్ సినిమాలే అని నమ్మి ఈ సినిమా చేసారు. మణిరత్నం సినిమా తమిళ ప్రేక్షకులకే పరిమితమని మొదటి రోజే తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు 'విక్రమ్- వేదా' కు పోటి లేదు పెద్ద హిట్ అవుతుందనుకున్నారు.   ఐదు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి దీనిపై వ్యయం చేసిన 175 కోట్లు కు లాభాలు కలిసి వెనక్కి వస్తాయనుకున్నారు. అయితే ఆ పరిస్దితి కనపడటం లేదు.  

తమిళంలో దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయం హిందీలోనూ డైరెక్ట్ చేశారు. సుమారు రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన బాలీవుడ్ ‘విక్రమ్ వేద’.. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ రివ్యూవర్లు 4 స్టార్లకు పైగా రేటింగ్‌లు ఇచ్చారు. అయితే, హిందీ ప్రేక్షకులు ఇచ్చిన ఫలితం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. హిందీ సినీ విమర్శకులంతా ‘విక్రమ్ వేద’ సినిమాను ఆకాశానికి ఎత్తితే.. ప్రేక్షకులు మాత్రం పాతాళానికి తొక్కేశారు. రూ.250 కోట్లకు పైగా వసూలు చేయాల్సిన ‘విక్రమ్ వేద’.. తొలిరోజు రూ.10.58 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో ఫలితం ఏంటో ట్రేడ్ వర్గాలకు అర్థమైపోయింది. 
 
ఈ క్రమంలో ఇప్పుడు సినిమాకు కలెక్షన్స్ పెంచటానికి ... అక్టోబర్ 7 నుంచి  దేశం మొత్తం   20-30% టిక్కెట్ రేట్లు తగ్గించామని ప్రకటించారు. ఈ వీకెండ్ అయినా వర్కవుట్ అవుతుందేమో అని ఆశ. కానీ ఆ ఇంపాక్ట్ ఏమీ కనిపించటం లేదంటోంది ట్రేడ్.

విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో 2017లో విడుదలైన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ ఘన విజయాన్ని అందుకుంది. సుమారు రూ.11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్‌తో రీమేక్ చేస్తున్నారు అనగానే అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన వేద పాత్రను హిందీలో హృతిక్ రోషన్ పోషించారు. దీంతో హృతిక్ ఆ పాత్రను ఎలా చేయనున్నారనే ఆసక్తి కూడా ఏర్పడింది. 

PREV
click me!

Recommended Stories

బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే
Allu Arjun: 5 సినిమాలతో అల్లు అర్జున్ సంచలనం, అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్.. ఆ మూవీ మాత్రం చాలా స్పెషల్