
దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు ఇప్పుడు అన్ని భాషల్లోనూ డిమాండ్. ఆయనతో సినిమా చేయటానికి అందరు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో అలాగే హిందీలో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఆ సినిమా ధియేటర్లలో మంచి కలెక్షన్స్ అందుకోవడం విశేషం. చాలా రోజుల తర్వాత థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా కూడా విక్రమ్ ఒక సంచలన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే లోకేష్ తదుపరి సినిమాను ఎవరితో చేస్తారు అనే విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. విజయ్ 67వ సినిమా లోకేష్ డైరెక్ట్ చేయబోబోతున్నాడు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వరీసు(తెలుగులో వారసుడు) మూవీతో బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేశ్ కనకరాజుతో ఓ సినిమా చేయనున్నాడు. విజయ్-లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మాస్టర్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెపన్కర్లేదు. దీంతో వీరిద్దరు కాంబో వచ్చే ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి ఈ మూవీ కథేంటి, ఈసారి ఏ థీమ్‌తో రాబోతున్నారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం విజయ్ కథకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. విక్రమ్ సినిమా కంటే నెక్ట్స్ లెవెల్ లో ఉండే విధంగా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఆ సినిమా కాన్సెప్ట్ కూడా బయట లీక్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఒక పిరియాడిక్ డ్రామాగా ఆ కథ ఉండనుందట. 1940ల కాలంలో ఒక అతి భయంకరమైన డాన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి గ్యాంగస్టర్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దళపతి 67వ చిత్రంగా రాబోతున్న ఇందులో విజయ్ ఓ దాదాగా కనిపించనున్నాడట. ఇక ఇందులో విజయ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం.
అంతేకాదు దాదాగా రేంజ్ తగ్గట్టుగా ఆరుగురు పవర్ఫుల్ విలన్స్ విజయ్ తలబోతున్నాడట. ఈ క్రమంలో విజయ్ వారిపై వేసే ఎత్తులు సస్పెన్స్ థ్రిల్లర్ ఉండనున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం కొంతమంది నటీనటుల విషయంలో కూడా లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరొక ప్రముఖ హీరోను కూడా ఈ సినిమాలో భాగం చేసేలా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా కనిపంచనున్నాడని వినికిడి. సంజయ్‌తో పాటు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్, టాలీవుడ్ నుంచి కూడా ఓ ప్రముఖ నటుడిని ప్రతికథానాయకులుగా ప్లాన్ చేస్తున్న ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదివరకే విజయ్ తో లోకేష్ చేసిన మాస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి విజయ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అనగానే సౌత్ ఇండస్ట్రీలో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.