Intinti Gruhalakshmi: దివ్య మాటలకు షాకైన లాస్య, నందు.. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న విక్రమ్?

Published : Feb 27, 2023, 08:52 AM IST
Intinti Gruhalakshmi: దివ్య మాటలకు షాకైన లాస్య, నందు.. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న విక్రమ్?

సారాంశం

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో రాజ్యలక్ష్మి ఈ అమ్మ వల్ల తప్పేమైనా జరిగిందా అనడంతో ఇంతలో విక్రమ్ అక్కడికి వచ్చి అమ్మ దేవత. దేవతలు ఎప్పుడూ తప్పు చేయరు, నాకు అమ్మ మీద ఎప్పుడు భక్తి తప్పితే కోపం రాదు. నీ మీద నాకు కోపం వస్తే ఆ రోజే నాకు జీవితంలో ఆఖరి రోజు అవుతుందమ్మా అనడంతో రాజ్యలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరి నువ్వు ఎందుకు అలా చేశావు ఒక క్షణం ఈ గుండె ఆగిపోయింది అనడంతో అమ్మ నేను కోపం వల్ల అలా లేనమ్మా బాధతో అలా ఉన్నాను అని అంటాడు. నీ పద్ధతి ఏం నాకు నచ్చడం లేదమ్మా అనడంతో ఎందుకు నాన్న అనడంతో నీకు ఇష్టం లేకపోయినా హాస్పిటల్ పెట్టించాను.

తమ్ముని డాక్టర్ ని చదివించాను ఎందుకు అనగా నాకోసం డాక్టర్ ఉండాలని, నా ఆరోగ్యం కోసం ఒక హాస్పిటల్ ఉండాలని పెట్టించావు అనడంతో కదా నువ్వు ఆరోగ్యం పట్ల సిద్ధ వహించడం లేదు అనగా లేదు నాన్న అనడంతో నువ్వు సరిగా అన్నం తినడం లేదు అని బాధగా మాట్లాడుతాడు విక్రమ్. ఏదో పని ఒత్తిడి వల్ల తినలేకపోయాను అనడంతో అయితే హాస్పిటల్ మూయించేద్దాం అని అంటాడు. మీకు తెలుసు కదా మామయ్య నా ప్రతి ఆలోచనలు అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అనడంతో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు అని అంటాడు వాళ్ళ మామయ్య. అంత ప్రేమగా క్యారీ కట్టిస్తే నువ్వు తినకుండా ఉంటావా నువ్వు తినకపోతే నా ప్రాణం విలవిలాడుతుంది అమ్మ అనడంతో నాకు తెలుసు నాన్న అని అంటుంది.

అప్పుడు వాళ్ళందరు సరదాగా జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉండగా ఎక్కడికి విక్రమ్ వాళ్ళ తాతయ్య వస్తాడు. నీకు టైం అయింది వెళ్ళు అనడంతో ఎక్కడికి తాతయ్య అనడంతో నీకు ఇంగ్లీష్ క్లాస్ కి టైం అయింది అనగా ఈరోజు నాకు  తలనొప్పిగా ఉంది ఆ టీచర్ ని వెళ్ళిపోమని చెబుతాను అనడంతో కాళ్ళు విరగగొడతాను అనగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మీ చిన్న  అయ్యగారిని క్లాస్ కి తీసుకెళ్ళు అనడంతో తాతయ్య ఏంటి ఈ దౌర్జన్యం అనడంతో అమ్మకు బాగోలేదని చెప్పి చదువుకి పంగనామాలు పెట్టావు ఇప్పుడు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోమంటే తప్పించుకొని తిరుగుతున్నావు అని అంటాడు. అప్పుడు దేవుడు విక్రమ్ ని లోపలికి పిలుచుకొని వెళ్తాడు.

మరొకవైపు లాస్య దివ్య ఇంకా రాలేదు ఏంటి వాళ్ళ అమ్మలాగే పెత్తనాలు ఎక్కువైపోయాయి అనడంతో పక్కనే ఉన్న తులసి అలాగే చూడగా పరంధామయ్య అనసూయ ఇద్దరు లాస్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు అనసూయ ఆ స్వీట్ బాక్స్ ఇచ్చేలా ఉంటే ఇవ్వచ్చు కదా ఎందుకు దాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నావు అనగా మనసులోని మాట చెప్పావు ఆ స్వీట్ బాక్స్ లో నా మనసంతా అలాగే ఉంది నాకు పిచ్చెక్కినట్టు ఉంది అనడంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నయమవుతుంది లేని మావయ్య అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే సంతోషంగా దివ్య అక్కడికి వచ్చి నాన్న నాకు జాబ్ వచ్చింది అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు.

అప్పుడు పరంధామయ్య స్వీట్ బాక్స్ కూడా రెడీగా ఉంది అనగా సో ఫాస్ట్ అనగా అదేం కాదు దివ్య ఈ స్వీట్లు నీకు జాబ్ వచ్చినందుకు కాదు. దీనికి సంబంధించి ఇంకొక శుభవార్త ఉంది అనగా దివ్య ఆలోచనలో పడుతుంది. అప్పుడు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని లాస్య సంతోషంతో ఆడపిల్లకి చదువు, ఉద్యోగం చాలా ముఖ్యం అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది అదే పెళ్లి అనడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఉద్యోగం సంపాదించుకున్నావు మీ నాన్న కూడా నీకు పెళ్లి చేసి నీ బాధ్యత నిర్వహించుకోవాలని అనుకుంటున్నాడు నీకు ఆల్మోస్ట్ పెళ్లి సంబంధం ఫిక్స్ అయినట్లే అనడంతో దివ్య షాక్ అవుతుంది.

ఈ సంతోషంలో స్వీట్లు నీకే ఫస్ట్ తీసుకో దివ్య అని లాస్య సంతోషంగా ఇస్తుండగా నన్ను అడగకుండా నాకు చెప్పకుండా సంబంధం ఫిక్స్ చేయడం ఏంటి అనడంతో నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ సంబంధం చాలా మంచిది నువ్వు ఓకే అన్నావ్ అంటే ఈ సంబంధం సెట్ అయినట్లే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు లాస్య పెళ్ళికొడుకు వాళ్ళ ఆస్తుల గురించి వివరాల గురించి చెబుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే లైఫ్ లాంగ్ నువ్వు కళ్ళు మూసుకొని బతికేయొచ్చు అనడంతో వెంటనే దివ్య ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుని లైఫ్ లో బతకాలని చూస్తున్నాను.

అప్పుడే నా కళ్ళు మూయాలి అనుకుంటున్నారా ఏమ్మా అని తులసి  వైపు చూడగా తులసి మౌనంగా తలదించుకుంటుంది. ఇప్పుడిప్పుడే జీవితంలో ఎదగాలి అనుకుంటున్నాను ఎదిగితే జీవితం విలువ తెలుస్తుంది అనడంతో నీ జీవితం నీది కానీ మంచి సంబంధం వచ్చిందని ఓకే చెప్పాము అని నందు అనడంతో ఈ సంబంధం వద్దు అంటే జీవితంలో నాకు సంబంధాలు రావని మీరు ఫిక్స్ అయ్యారా అని అంటుంది. అది కాదమ్మా నీకు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది కూడా నాకు నచ్చితేనే జరగాలి అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు దివ్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అందరూ ఆలోచనలో పడతారు. మరొకవైపు విక్రమ్ ని దేవుడు ఇంగ్లీష్ నేర్చుకోమని గదిలోకి తోసి తాళం వేయడంతో లోపలికి వెళ్లిన విక్రమ్ టీచర్ వైపు చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు.

అప్పుడు టీచర్ దగ్గర అవడంతో విక్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు టీచర్ దగ్గరికి రావడంతో విక్రమ్ టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు టీచర్ చీర కొంగుతో విక్రమ్ చెమటను తుడుస్తుంది. ఆ తర్వాత విక్రమ్ దివ్య అక్కడికి వచ్చినట్టు ఊహించుకొని సంతోష పడుతూ ఉంటాడు విక్రమ్. అప్పుడు దివ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి సంతోష పడుతూ ఉంటాడు విక్రమ్. అప్పుడు తీరా చూసేసరికి అక్కడ మేడం ఉండగా ఈ సిలబస్ అయిపోయి లోపు నేను పెళ్ళికి పనికిరాకుండా అయిపోతాను అని విక్రమ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా దేవుడు బయట గడియ పెట్టాను బయటకు రానివ్వను అని అంటాడు. అప్పుడు ఒరేయ్ దేవుడు ప్లీజ్ రా దేవుడు తీయరా అని విక్రమ్ లోపలి నుంచి బ్రతిమిలాడుతూ ఉండగా దేవుడు మాత్రం నేను తీయను కాక తీయను అని అంటాడు.

టీచర్ అమ్మగారు పాటలు పూర్తయ్యాయ అనగా ఇంకెక్కడ ఇంకా ఇప్పుడే మొదలైంది అని అంటుంది. అప్పుడు ఒరేయ్ తాతయ్యకి బీరువా తాళాలు కావాలంట తలుపు సందులో నుంచి చేయి పెడితే ఇస్తాను అనగా అప్పుడు దేవుడిని లోపలికి లాగి అక్కడి నుంచి పారిపోతాడు విక్రమ్. మరొకవైపు తులసి ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో నందు అక్కడికి వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలి అనడంతో దివ్య పెళ్లి విషయం అయితే నేనేం చేయలేను అనగా అలా తీసేసినట్టు మాట్లాడకు తులసి అని లాస్య కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు లాస్య ఏదో ప్లాన్ వేసి తులసి వాళ్లందరికీ కాఫీ నవ్వుతూ ఇస్తుంది. అప్పుడు లాస్య దివ్య గురించి తులసి తో మాట్లాడుతూ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో