
సారా అలీ ఖాన్ సోషల్ మీడియా ఫ్రీక్. ఫ్యాన్స్ తో 24*7 టచ్ లో ఉంటారు. తన డైలీ లైఫ్ నుండి మూవీ అప్డేట్స్ వరకు అన్నీ షేర్ చేస్తుంటారు. తాజాగా తన వీకెండ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. స్విమ్ సూట్ ధరించిన సారా అలీ ఖాన్ తన మిత్రుడితో పాటు పూల్ లో జలకాలాడుతున్నారు. ఇక తడిసిన శరీరాన్ని వెచ్చని సూర్య కిరణాలతో ఆరబెట్టుకుంటున్నారు. మెస్మరైజ్ చేసేలా ఉన్న తన వీకెండ్ సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన సారా... కిక్ ఇచ్చే కామెంట్ చేశారు.
'సారా అండ్ సంకీ ఎండలో తడిఆరుతున్నారు. సారా అండ్ సంకీ ఆహ్లాదంగా గడుపుతున్నారు...' అని కామెంట్ పెట్టారు. ఒక అబ్బాయితో స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడడం కూడా సారాకు కామన్ అయిపోయింది. హై కల్చర్డ్ సొసైటీ నేపథ్యంలో ఇవన్నీ నథింగ్ అన్నట్లు తయారైంది. ఇక సారా వీకెండ్ సెలబ్రేషన్స్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య వరల్డ్ టూర్ కి వెళ్లిన సారా టూర్ డైరీస్ క్రమం తప్పకుండా అభిమానులకు తెలియజేసింది.
హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె అయిన సారా అలీ ఖాన్ బోల్డ్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నారు. పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు కాకుండానే అనేక ఎఫైర్ రూమర్స్ సారా ఎదుర్కొన్నారు. ఇక సినిమాల్లోకి రాకముందు సారా చాలా లావుగా ఉండేవారు. నటనపై మక్కువతో తనను తాను సమూలంగా మార్చుకున్నారు. భారీగా బరువు తగ్గి షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాధించారు. 2018లో విడుదలైన కేధార్ నాథ్ చిత్రంతో హీరోయిన్ అయ్యారు. 2021లో విడుదలైన అత్రాంగి రే చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.
అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా నటించిన అత్రాంగి రే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ప్రస్తుతం నాలుగు చిత్రాల వరకు ఆమె చేతిలో ఉన్నాయి. జాన్వీ కపూర్ , సారా ఒకే సమయంలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. జాన్వీతో పోల్చితే సారా కెరీర్ బెటర్. ఆమె ఖాతాలో ఒకటి రెండు హిట్స్ ఉన్నాయి. కమర్షియల్ చిత్రాల్లో చాన్సులు దక్కించుకుంటుంది.