
ఈరోజు ఎపిసోడ్ లో దివ్య, విక్రమ్ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. ఇంతలోనే అనుకోకుండా విక్రమ్ వాళ్ళ కారు ఒక స్కూటీని గుద్దడంతో విక్రం దివ్య టెన్షన్ గా వెళ్లి వాళ్ళని పైకి లేపుతారు. ఆ తర్వాత అమ్మాయికి దెబ్బలు తగలడంతో దివ్య ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి చెప్తూనే ఉన్నాను కదా బండి నెమ్మదిగా డ్రైవ్ చేయమని నీకు ఏదైనా అయితే అంటే నాకేం కాలేదు కదా అని అనగా నీకు ఏదైనా అయితే నేనేం కావాలి అనడంతో అప్పుడు అతను ఆమెపై సీరియస్ అవుతాడు. ఏంటి బ్రదర్ మీ గర్ల్ ఫ్రెండ్ అనగా అవును అనడంతో చూడు బ్రదర్ అమ్మాయి నీకోసం అంత జాగ్రత్త పడుతూ అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నువ్వు కోపడ్డంలో అర్థం లేదు అని అంటాడు విక్రమ్.
అప్పుడు విక్రమ్ మంచి మాటలు చెప్పి అతని కళ్ళు తెరిపించడంతో ఆ మాటలు విని దివ్య సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ ప్రేమ గురించి ప్రేమించిన వాళ్ల గురించి గొప్పగా చెప్పడంతో దివ్య సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దివ్య విక్రమ్ ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటండీ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అనగా ఏమి లేదు నేను వెళ్ళొస్తాను అనడంతో ఒక నిమిషం ఆగండి అని దివ్య హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడు వాళ్ళు ఒకరి వైపు ఒకరు చూసి సిగ్గుపడుతూ ఉండగా అది చూసి దేవుడు సంతోష పడుతూ ఉంటాడు. తర్వాత దివ్య టెన్షన్ పడుతూ అమ్మకి ఎలా ఉందో అనుకుంటూ లోపలికి వెళ్తుండగా మరోవైపు నందు తులసికి సూప్ తినిపిస్తూ ఉంటాడు.
అది చూసి దివ్య పరందామయ్య అనసూయ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత అనసూయ పరంధామయ్య దివ్య ఒకచోటకు వెళ్లి తులసి వాళ్ళు అలా ఉన్నందుకు సంతోషపడుతూ విడాకులు తీసుకున్న విషయం గురించి బాధపడుతూ ఉంటారు. అప్పుడు దివ్య బాధపడుతుండగా పరంధామయ్య అనసూయ ఇద్దరు ధైర్యం చెబుతూ ఉంటారు. అనసూయ భార్యాభర్తల బంధం గురించి దివ్యకి చెప్పడంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత దివ్య హాస్పిటల్ లో ఉండగా ఇంతలో తులసి తరఫున ఒక పేషెంట్ రావడంతో ఇంతలో తులసి ఫోన్ చేసి మీ హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు కడుపులో అలాగే కత్తెరను అలాగే వదిలేశారు. నా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు చాలా బీద వాళ్ళు అది ఒకసారి చూడమ్మా అనడంతో సరే అమ్మ నేను చూసుకుంటాను ఫోన్ కట్ చెయ్ అని అంటుంది దివ్య.
తరువాత దివ్య రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లి మన హాస్పిటల్ పరిస్థితి దిగజారి పోతుంది అని అనడంతో నువ్వు ఈ హాస్పిటల్ లో ఒక డాక్టర్ వి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకో అని సీరియస్ అవుతాడు సంజయ్. అసలేం జరిగింది దివ్య అనగా ఒక పేషెంట్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు అవసరం లేకపోయినా ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెర లోపల పెట్టి మర్చిపోయారు ఇప్పుడు ఏంటి అని అడిగితే చేతులు ఎత్తేస్తున్నారు. పేషెంట్ పరిస్థితి ఏమిటి? ఆపరేషన్ చేసింది ఎవరో కాదు సంజయ్ అనడంతో సంజయ్ నేను కాదు అంటూ బుకాఇస్తూ ఉండగా నువ్వు కాదు నేను ప్రూవ్ చేస్తాను అని అంటుంది దివ్య. అప్పుడు రాజ్యలక్ష్మి కూల్ గా మాట్లాడుతూ దివ్య వెంటనే ఆ పేషెంట్ ని మన హాస్పిటల్ జాయిన్ అవ్వమను అనగా లేదు మేడం వాళ్ళు బయట ట్రీట్మెంట్ చేయించుకుంటారు అంట పది లక్షలు ఇవ్వమని చెప్పారు అనడంతో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని అంటాడు సంజయ్.
పోలీసులు కంప్లైంట్ ఇవ్వమంటారా అనగా రాజ్యలక్ష్మి సంజయ్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. చూసావా మామ్ ఎలా బెదిరిస్తుందో అనడంతో నేను చేయబోయేది కాదు సార్ వాళ్ళు చేయబోయేది చెప్తున్నాను అని అంటుంది దివ్య. రాజ్యలక్ష్మి చేసేది ఏమీ లేక సంజయ్ ని స్వారీ చెప్పమని చెప్పి పది లక్షలు చెక్కు రెడీ చేయమని చెబుతుంది. ఇంతలో పేషంట్ అక్కడికి రావడంతో సంజయ్ వాళ్లకు సారీ చెప్పి పది లక్షలు చెక్ ఇస్తాను తీసుకొని వెళ్లిపోండి అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మీ దివ్య వైపు కోపంగా చూస్తూ దివ్య రాను రాను నా చెప్పులో రాయలా తయారవుతోంది అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నందు కిచెన్ లో తులసి కోసం వంట చేస్తూ ఉండగా అప్పుడు ఫోన్ చేసి నందుని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది.
అప్పుడు కావాలనే నందుతో లేనిపోని గొడవలు సృష్టిస్తూ తులసి వాళ్ల గురించి బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటుంది. తులసి తో బాగానే మూవ్ అవుతున్నావు అనగా మనం ప్రస్తుతం నాటకం ఆడుతున్నాం ఎవరి క్యారెక్టర్లలో వాళ్ళు ఉండాలి అని అంటాడు నందు. అప్పుడు లాస్య నందుతో తులసి గురించి మాట్లాడుతూ ఉంటుంది. వారిద్దరి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నందు ఇది భూతద్దంలో చూడొద్దు లాస్య అర్థం చేసుకో అని అంటాడు. అవన్నీ వదిలిపెట్టు నువ్వు కేఫ్ కి వచ్చేయయ్ అనడంతో నేను రాను తులసికి హెల్త్ బాగోలేదు అని అంటాడు నందు. సరే అలా అయితే నువ్వే వచ్చి అసలు నిజం చెప్పేసేయ్ నాకు రిలీఫ్ గా ఉంటుంది అనగా లాస్య చేసేది ఏమీ లేక తులసికి కాస్త దూరంగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత నందు తులసికి సేవలు చేస్తూ ఉంటాడు.
మరోవైపు విక్రమ్ హాస్పిటల్ లో తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండటం కోసం కర్చీఫ్ కట్టుకొని మరి తిరుగుతూ ఉంటాడు. సంజయ్ దివ్య గురించి చెప్పడంతో దివ్య అని తెలియక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు లాస్య ఆలోచించుకుంటూ కార్లో వెళ్తుండగా ఇంతలో భాగ్య ఫోన్ చేసి విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం చెబుతుంది. ఆ తర్వాత దివ్య కోసం విక్రమ్ హాస్పిటల్ బయట ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు దివ్య రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలో రౌడీలు వచ్చి గొడవ చేయడంతో విక్రమ్ వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. అప్పుడు విక్రమ్ దివ్య ని కాపాడడంతో దివ్య ఇంప్రెస్ అవుతుంది. తర్వాత విక్రమ్ దివ్య ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తారు. మరోవైపు నందు తులసికి దగ్గరుండి సేవలు చేస్తూ ఉండగా అది చూసి వాసుదేవ్ దంపతులు సంతోష పడుతూ ఉంటారు. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.