
ఈరోజు ఎపిసోడ్ లో రిషి నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నావా అదే పెద్దమ్మ అన్న మాటలు గురించి అని అడగగా నా మనసులో ఎటువంటి ప్రశ్నలు లేవు సార్. సమాధానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రశ్నలకు అది సరిపోవడంలేదని మీరు అనుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు దేవయాని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది. అప్పుడు వసుధార కోపం తగ్గదా అనగా ఏమో తెలియదు గుడ్ నైట్ వసుధార అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటిరోజు ఉదయం రిషి కాలేజీలో వసుధార క్యాబిన్ కి వెళ్తాడు. అక్కడ వసు, రిషి ల ఫోటోని చూసి సంతోషపడుతూ ఉంటాడు.
ఒక్క మాట చెప్పవచ్చు కదా వసుధార అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు రిషి. నువ్వు చేసిన ఆ ఒక్క పని వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుస్తోందా అనుకుంటూ ఆ ఫోటోలతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే వసుధర అక్కడికి వచ్చి మే ఐకమింగ్ సార్ అనడంతో నీ క్యాబిన్ కాబట్టి అడగాల్సిన అవసరం లేదు అనడంతో మీరు మా ఎండి కదా సార్ అని అంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అడుగుతావు పెద్ద పెద్ద విషయాలు మాత్రం దాచిపెడతావు అని అంటాడు. ఎందుకు వచ్చారు సార్ అనగా రిషి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సార్ అని పిలుస్తుంది వసుధార.
ఏంటి అని అనగా అప్పుడు వసు రిషి కలలోకి కళ్ళు పెట్టి చూస్తూ రిషి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు వసు దగ్గరగా వస్తుండగా రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు రిషి షర్ట్ కీ ఉన్న దారం తీసి మీరు జెంటిల్మెన్ సర్ ఇలాంటి చిన్న తప్పులు కూడా ఉండకూడదు అని అనగా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత దేవయాని ఆకలిగా ఉంది అనడంతో ధరణి కిచెన్ లో ఉన్న ఐటమ్స్ తీసుకొని వచ్చి పెట్టగా ఏంటి ఇన్ని ఐటమ్స్ చేశావు అనగా నేను చేయలేదు అత్తయ్య వసుధార చేసింది అనడంతో షాక్ అవుతుంది దేవయాని.
వసు వంట చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఆ వసుధర వంటగదిని కూడా కబ్జా చేసిందా అనడంతో తనకి కూడా నాతో పాటు సమాన హక్కులు ఉన్నాయి కదా అత్తయ్య అని అంటుంది. అప్పుడు దేవయాని ఏంటి ధరణి కొత్తగా హక్కుల గురించి మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు కావాలనే దేవయానిని కన్ఫ్యూజన్ చేసి ధరణి తింగరి తింగరి గా మాట్లాడుతూ ఉంటుంది. తినండి అత్తయ్య గారు అనడంతో తింటాలే అది కూడా నువ్వే చెప్పాలా అని అంటుంది. అబ్బా ఆకలి అవుతుంది తినాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటుంది దేవయాని. మరొకవైపు జగతి,మహేంద్ర ఇద్దరు కలిసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎలా అయినా వసు, రిషిని దగ్గర చేయాలి ఈ విషయంలో నాకు ఏమీ ఐడియాలు రావడం లేదు నువ్వు చెప్పు మహేంద్ర అని అంటుంది జగతి. అప్పుడు మహేంద్ర మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేద్దాం అప్పుడు మనకు పని ఉంది అని చెప్పి బయటకు వెళ్దాం.. అప్పుడు వారిద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అని అంటాడు. తర్వాత జగతి వసుధారకీ ఫోన్ చేసి ఈ రోజు నాకు కొంచెం బయట పని ఉంది లంచ్ కి రావడం లేదు మీరిద్దరూ తినండి అనడంతో ఏం పని మేడం అనగా పని అంటే పని అని అంటుంది జగతి. నేను మహేంద్ర బయటకు వెళ్తున్నాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
తరువాత మహేంద్ర రిషి కి ఫోన్ చేసి నాకు పని ఉంది బయటకి వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు వారిద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి క్యాబిన్ కి వెళ్లి ఈ పొగరు ఎక్కడ ఉందో చూడాలి అనుకుంటున్నాగా పక్కనే వసుధార చేసుకుంటూ ఉండగా లంచ్ తిందాం రా అని మెసేజ్ చేయగా నాకు వద్దు సార్ మీరు తినండి అని మెసేజ్ చేస్తుంది వసుధార. అప్పుడు వారిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. తరువాత రిషి భోజనం ముందు కూర్చుని వసుధార కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార అక్కడికి ఫోన్ చూస్తూ రాగా ఏంటి ఫోన్ చూస్తున్నావు అనగా మా ఎండి గారు ఇందాక మెసేజ్ చేస్తాము అన్నారు ఇంకా చేయలేదు సార్ అనడంతో తనకి ఏవో పనులు ఉంటాయి అని అంటాడు రిషి.
ఆకలి అవుతుంది అని అనగా సరే సార్ తిందాము అని అనగా వసుధార భోజనం వడ్డీస్తూ ఉంటుంది. తర్వాత రిషి భోజనం తింటూ వంటలు అద్భుతంగా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి అనడంతో వసుధార సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి సార్ మీరు మీకోసం అంత కష్టపడి చేస్తే వసుధార వంటలు బాగున్నాయి రేపటి నుంచి ఇలాగే చెయ్యి అనొచ్చు కదా అని ఆయాసపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మీటింగ్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పచెబుతాడు రిషి..
తర్వాత జగతి దంపతులు ఇంటికి వెళ్లడంతో దేవయాని రిషి వాళ్ల గురించి ఆరా తీయగా వెంటనే జగతి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విషయాలలోకి అది భార్యాభర్తల మధ్యలోకి తల దూర్చే అలవాటు నాకు లేదు అనే తగిన విధంగా బుద్ధి చెబుతుంది. తర్వాత వసుధార కాలేజ్ అయిపోయిన పని చేస్తుండగా రిషి అవసరం లేదు వెళ్దాం పద అని తనతో మాట్లాడుకుంటూ పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు వసుధార రిషి అడుగులో అడుగు వేస్తూ నవ్వుకుంటూ వెనకాలే వెళుతూ ఉంటుంది. ఇప్పుడు రిషి ఎలా చేస్తే అలా చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తూ స్పాట్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుతూ ఉండగా ఎలా అయినా దానిని తనకు అనుగుణంగా మార్చుకోవాలి అనుకుంటూ ఉంటుంది దేవయాని.
అప్పుడు దేవయాని దానికి అడ్డు చెప్పగా అందరూ కలిసి దేవయాని నోరు మూయిస్తారు. ఆ తర్వాత వసుధార పని చేస్తూ ఉండగా ఇంతవరకు వసుధార పని చేయడం ఏంటి అని రిషి అక్కడికి వెళ్లి పడుకోవచ్చు కదా అనగా వర్కు ఉంది సార్ అని అంటుంది. అప్పుడు రిషి సరే అని గుడ్ నైట్ చెప్పి అక్కడ నుంచి వెళ్లి కాఫీ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత వసుధార పని చేస్తూ ఉండగా రిషి అక్కడే రూమ్లో అలాగే ఉండి నిద్రపోతాడు. రిషి గదిలో పడుకోవడంతో వసుధార బయటికి వెళ్తుంది.