విక్రమ్‌ బర్త్ డే సర్ ప్రైజ్‌లు.. `వీరధీర శూరన్`గా కొత్త మూవీ.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న `తంగలాన్‌` గ్లింప్స్

Published : Apr 17, 2024, 10:56 PM ISTUpdated : Apr 17, 2024, 11:02 PM IST
విక్రమ్‌ బర్త్ డే సర్ ప్రైజ్‌లు.. `వీరధీర శూరన్`గా కొత్త మూవీ.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న `తంగలాన్‌` గ్లింప్స్

సారాంశం

కోలీవుడ్‌లో ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచే విక్రమ్ ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నారు. కొత్త మూవీని ప్రకటించారు. మరోవైపు `తంగలాన్‌` గ్లింప్స్ రిలీజ్‌ చేశారు.   

విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు చియాన్‌ విక్రమ్‌. ఆయన సినిమాల్లో చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు, కమల్‌ హాసన్‌ తర్వాత ప్రయోగాల విషయంలో విక్రమ్‌ పేరే వినిపిస్తుంది. విభిన్నమైన పాత్రల్లో జీవిస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న `తంగలాన్‌`లోనూ ఆయన డీ గ్లామర్‌ లుక్‌లో, అడవి తెగలకు చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మరో డిఫరెంట్‌, పవరఫుల్‌ కంటెంట్‌తో వస్తున్నారు విక్రమ్‌. నేడు తన పుట్టిన రోజు, శ్రీరామ నవమి పండుగ సందర్భంగా బుధవారం తన కొత్త సినిమాని ప్రకటించారు. దీనికి `వీర ధీర శూరన్‌` అనే టైటిల్‌ని ప్రకటించారు. 

చియాన్ విక్రమ్‌ నటిస్తున్న 62వ చిత్రం కావడం విశేషం. ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీకి ఎస్‌ యు అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా, హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ప్రకటిస్తూ ఓ టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో హీరో పేరు కాళి. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.. అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. 

త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే విక్రమ్‌ అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెల్ల‌బెట్టేస్తుంది. 225 సెక‌న్ల పాటుండే  ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ ఉంటే, ఇక సినిమాలో ఏం రేంజ్‌లో ఉంటాయో  అర్థం చేసుకోవ‌చ్చు. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  

గూస్‌ బంమ్స్ తెప్పిస్తున్న `తంగలాన్‌` గ్లింప్స్..

ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్రమ్‌ పా రంజిత్‌ దర్శకత్వంలో `తంగలాన్‌` మూవీలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జీయో స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఆయన బర్త్ ట్రీట్‌ వచ్చింది. సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో  ఇందులో చూపించారు. నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో విక్రమ్‌ ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ వీడియోతో తెలుస్తోంది. "తంగలాన్" సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు, ఆయన చేసే యాక్షన్‌ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. 

ఈ మూవీ గురించి దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ , `తంగలాన్` సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్ తో పాటు మూవీ టీమ్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. జియో స్టూడియోస్ `తంగలాన్` సినిమా కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం` అన్నారు. `తంగలాన్` సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..