RRR, డెవిల్ చిత్రాల బాటలోనే రానా 'రాక్షస రాజా'.. నేపథ్యం ఇదే..

By tirumala ANFirst Published Apr 17, 2024, 6:30 PM IST
Highlights

బ్రిటిష్ నేపథ్యంలో బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. అయితే అన్ని చిత్రాలు విజయం సాధించలేదు. ఇప్పుడు రానా దగ్గుబాటి కూడా బ్రిటిష్ నేపథ్యంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

బ్రిటిష్ నేపథ్యంలో బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. అయితే అన్ని చిత్రాలు విజయం సాధించలేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కి పాన్ ఇండియా బల్క్ బస్టర్ గా నిలిచింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ చిత్రం కూడా బ్రిటీష్ టైంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

ఇప్పుడు రానా దగ్గుబాటి కూడా బ్రిటిష్ నేపథ్యంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. తేజ, రానా కాంబినేషన్ లో 'రాక్షస రాజా' అనే చిత్రానికి ప్రకటన వచ్చింది. డైరెక్టర్ తేజ ఈ చిత్రాన్ని బ్రిటీష్ టైంలో జరిగే ఫిక్షన్ కథగా తెరకెక్కించబోతున్నారట. 

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ మూవీ నేనే రాజు నేనే మంత్రి మంచి విజయం సాధించింది. ఇప్పుడు రాక్షస రాజా చిత్రంలో సరికొత్త అవతారంలో తేజ రానాని చూపించబోతున్నాడట. ఆంధ్ర, మద్రాసు సరిహద్దు ప్రాంతాల్లో జరిగే కథ అని తెలుస్తోంది. 

జూన్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో తేజ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. బాహుబలి తర్వాత రానా సినిమాల వేగం బాగా తగ్గింది. 

click me!