ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి గుండెపోటు!

Published : Apr 17, 2024, 06:57 PM IST
ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి గుండెపోటు!

సారాంశం

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నటుడు మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు.   

పలు భాషల్లో నటించిన మన్సూర్ అలీ ఖాన్ సినిమా లవర్స్ కి సుపరిచితుడే. ఆయన రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఇండియా జననాయక పులిగళ్ పార్టీ ని స్థాపించాడు. అయితే ఈ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి లేకుండా ఏఐఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ... ఆయన్ని పార్టీ నుండి బహిష్కరించారు. తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా...  మన్సూర్ అలీ ఖాన్ వేలూరు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న మన్సూర్ అలీ ఖాన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. కాగా ఎన్నికల ప్రచారంలో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పి రావడంతో పక్కనే ఉన్న వాలంటీర్లు గుడియాతం ప్రాంతంలో గల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తుత కండిషన్ పై సమాచారం అందాల్సి ఉంది. 

కాగా ఇటీవల హీరోయిన్ త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. లియో మూవీలో వీరిద్దరూ నటించారు. త్రిష హీరోయిన్ అనగానే రేప్ సీన్ ఉంటుంది. ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లే ఛాన్స్ వస్తుందని ఆశపడ్డాను. కానీ కాశ్మీర్ లో ఆమెను నాకు అసలు చూపించనే లేదు అని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. 

మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ ని చిరంజీవితో పాటు కోలీవుడ్, టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఖండించారు. త్రిష అయితే ఇకపై తనతో నటించను అని మండిపడింది. తన కామెంట్స్ ని మన్సూర్ అలీ ఖాన్ సమర్ధించుకోవడం విశేషం. ఆయన చిరంజీవి పై పరువు నష్టం దావా వేశాడు. ఏ కేసులో మద్రాస్ హై కోర్ట్ మన్సూర్ అలీ ఖాన్ కి చివాట్లు పెట్టింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..