Latest Videos

పృథ్వీరాజ్ కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు

By Surya PrakashFirst Published Jun 13, 2024, 11:57 AM IST
Highlights

 పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు ...


గత కొంతకాలంగా ధర్టీ  ఇయ‌ర్స్ పృథ్వీ   కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోతున్నాడు.ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గాసెటిల్ అయ్యిపోయాడు. కమెడియన్ గా కామెడీ విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఆయన  కు విజయవాడ కోర్ట్ లో చుక్కెదురు అయింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. 

మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. 

అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్‌, సప్పా రమేష్‌, సీహెచ్‌ వడ్డీకాసులును సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో వివరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.

ఇక ధర్టీ  ఇయర్స్ పృథ్వీ కెరీర్ ఇప్పుడు డైలమాలో  ఉంది. ఒకప్పుడు వరస సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆ మధ్యన  ఓ ఆడియో టేప్‌లో ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు పృథ్వీ. దాంతో SVBC ఛైర్మన్ పదవి కూడా పోయింది. ఈ విషయంపై వైసీపీలో 30 ఇయర్స్ పృథ్వీపై కొందరు సెటైర్లు కూడా వేసారు. ఆ వాయిస్ తనది కాదని ఎంత చెప్పినా కూడా బయట మాత్రం ఆ డైలాగులు బాగా ఫేమస్ అయిపోయాయి. వెనకనుంచి వాటేసుకుందామనుకున్నా అంటూ టేపులో ఉన్న మాట వైరల్ అయిపోయింది. జబర్దస్త్, అదిరింది లాంటి షోలలో అదే వాడేసుకున్నారు. ఆ తర్వాతే ఆయనకు సినిమా ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.  అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తున్నారు. 

click me!