Latest Videos

కిక్ ఇచ్చేలా అక్కినేని అఖిల్ లేటెస్ట్ లుక్! 

By Sambi ReddyFirst Published Jun 13, 2024, 8:26 AM IST
Highlights

అక్కినేని హీరో అఖిల్ లేటెస్ట్ లుక్ కిక్ ఇచ్చేలా ఉంది. లాంగ్ హెయిర్, గడ్డంలో అఖిల్ హాలీవుడ్ హీరోని తలపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 
 

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన డెబ్యూ మూవీ 'అఖిల్' భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. సోషియో ఫాంటసీ అంశాలతో ఈ మూవీ తెరకెక్కించారు. అరంగేట్రంతోనే మాస్ హీరోగా అఖిల్ ని నిలబెట్టాలన్న నాగార్జున ప్లాన్ బెడిసి కొట్టింది. లాభం లేదని రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ వైపు మళ్లారు. 

హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ ట్రై చేశాడు. అవి కూడా ఫలితం ఇవ్వలేదు. నాలుగో చిత్రంతో అఖిల్ హిట్ ట్రాక్ ఎక్కాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అఖిల్ కెరీర్లో ఫస్ట్ హిట్ గా నమోదు అయ్యింది. 

అయితే ఏజెంట్ రూపంలో అఖిల్ మరో ప్లాప్ మూటగట్టుకున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించి స్పై థ్రిల్లర్ డిజాస్టర్ అయ్యింది. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఏజెంట్ చిత్రం చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అఖిల్ కన్ఫ్యూషన్ లో పడ్డాడు. నెక్స్ట్ ఎలాంటి చిత్రం చేయాలనే మీమాంసలో ఉన్నాడు. తాజాగా అఖిల్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చాడు. అతడు బెంగుళూరు వెళుతున్నట్లు సమాచారం. 

అఖిల్ లాంగ్ హెయిర్, గడ్డం తో సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. ఆయన లుక్ హాలీవుడ్ హీరోలను తలపిస్తుంది. అఖిల్ మేకోవర్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్ కిక్ ఫీల్ అవుతున్నారు. ఈ మేకోవర్ నెక్స్ట్ సినిమాకే అంటూ ప్రచారం జరుగుతుంది. అఖిల్ అధికారికంగా కొత్త మూవీ ప్రకటన చేయలేదు. 
 

new look

Waiting A6 pic.twitter.com/r8JLrjmg46

— poorna .. (@seenukingnag)
click me!