Latest Videos

రేవ్ పార్టీ కేసులో నటి హేమకి కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

By tirumala ANFirst Published Jun 12, 2024, 10:27 PM IST
Highlights

రేవ్ పార్టీ కేసులో నటి హేమని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఆమెని రిమాండ్ కి తరలించారు.

వ్ పార్టీ కేసులో నటి హేమని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఆమెని రిమాండ్ కి తరలించారు. ముందుగా తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని అసలు బెంగుళూరుకే వెళ్లలేదని హేమ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె ఫోటోలు రిలీజ్ చేసి గుట్టు రట్టు చేశారు. 

ఆ తర్వాత విచారణకు హాజరు కాకుండా పోలీసులకు హేమ సహకరించలేదు. పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించలేదు. దీనితో పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి ఆమెని అరెస్ట్ చేశారు. అయితే బుధవారం రోజు హేమ బెయిల్ పిటిషన్ పై బెంగుళూరు రూరల్ ఎన్టీపీఎస్ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. 

 

ఈ విచారణలో హేమ తరుపున న్యాయవాది పాల్గొన్నారు. హేమ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని ఆమెన్యాయవాది వాదనలు వినిపించారు. దీనితో కోర్టు హేమకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది హేమకి భారీ ఊరట అని చెప్పొచ్చు. 

హేమని రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా కఠినంగా స్పందించింది. ఆమె మా ప్రాధమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు మా నిర్ణయం తీసుకుంది. 

click me!