'ఎన్టీఆర్'కి కూతురు దొరికింది!

Published : Sep 22, 2018, 03:47 PM IST
'ఎన్టీఆర్'కి కూతురు దొరికింది!

సారాంశం

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ దివంగత ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య ఘట్టాలను తెరపై చూపించడానికి రెడీ అవుతున్నారు. 

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ దివంగత ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య ఘట్టాలను తెరపై చూపించడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానాని, ఏఎన్నార్ పాత్ర కోసం సుమంత్ ని తీసుకున్నారు. ఇటీవలే వీరిద్దరూ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. అయితే మిగిలిన పాత్రల్లో ఎవరెవరు కనిపించబోతున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

తాజాగా ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరి పాత్రలో ఓ డాన్సర్ కనిపించనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయవాడకి చెందిన ప్రముఖ నృత్యకారిణి హిమన్సీ.. పురందరేశ్వరి పాత్రలో కనిపించనుందని టాక్.

వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పురందరేశ్వరి పాత్రకి హిమన్సీ యాప్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి