ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైన భారతీయ చిత్రం!

By Udayavani DhuliFirst Published Sep 22, 2018, 3:00 PM IST
Highlights

వచ్చే ఏడాదిలో జరగబోయే 91వ ఆస్కార్ అవార్డుల నామినేషన్  కి భారత్ తరఫున అస్సాంలో తెరకెక్కిన 'విలేజ్ రాక్ స్టార్స్' అనే సినిమా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో 'విలేజ్ రాక్ స్టార్స్' ఆస్కార్ అవార్డుకి పోటీ పడుతోంది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శనివారం అనౌన్స్ చేసింది

వచ్చే ఏడాదిలో జరగబోయే 91వ ఆస్కార్ అవార్డుల నామినేషన్  కి భారత్ తరఫున అస్సాంలో తెరకెక్కిన 'విలేజ్ రాక్ స్టార్స్' అనే సినిమా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో 'విలేజ్ రాక్ స్టార్స్' ఆస్కార్ అవార్డుకి పోటీ పడుతోంది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శనివారం అనౌన్స్ చేసింది.

ముందుగా ఈ అవార్డుల బరిలో భారత్ నుండి దాదాపు 28 సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో 'విలేజ్ రాక్ స్టార్స్' తో పాటు 'పద్మావత్', 'రాజీ', 'హిచ్ కీ', 'అక్టోబర్' ఇలా చాల సినిమాలున్నాయి.

వీటన్నింటితో పోటీ పడి 'విలేజ్ రాక్ స్టార్స్' సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. అస్సాంలోని ఓ మారుమూల పల్లెటూరికి చెందిన పదేళ్ల అమ్మాయికి గిటార్ అంటే ఎంతో ఇష్టం. సొంతంగా బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది.

ఈ క్రమంలో ఆమె తనకు ఎదురైనా పరిస్థితులను ఎదుర్కొని రాక్ స్టార్ గా ఎలా ఎదిగిందనే డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు ఉత్తమ జాతీయ అవార్డు లభించింది. రీమా దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

click me!