ఇతర కంటెస్టెంట్స్ పై ట్రోల్స్ ఆపండి.. కౌశల్ భార్య విన్నపం!

Published : Sep 22, 2018, 03:27 PM ISTUpdated : Sep 22, 2018, 03:29 PM IST
ఇతర కంటెస్టెంట్స్ పై ట్రోల్స్ ఆపండి.. కౌశల్ భార్య విన్నపం!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతడి కోసం ర్యాలీలు, రక్త దానాలు చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతడి కోసం ర్యాలీలు, రక్త దానాలు చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. కౌశల్ కి క్రేజ్ పెరగడంలో కౌశల్ ఆర్మీతో పాటు అతడు భార్య నీలిమ కూడా తన వంతు కృషి చేస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో నీలిమ కౌశల్ ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. గత కొద్దిరోజులుగా హౌస్ లో చోటు చేసుకుంటున్న సంఘటనలతో తాను చాలా బాధ పడుతున్నట్లు ఆమె తెలిపారు.

అలానే కొన్ని సంతోషకరమైన విషయాలు కూడా చోటుచేసుకున్నాయని.. ఆ బాధని, సంతోషాన్ని మీరంతా పంచుకుంటున్నారని కౌశల్ ఆర్మీని ఉద్దేశించి నీలిమ అన్నారు. కౌశల్ ని మీ ఇంట్లో సభ్యుడిగా భావించి ప్రేమిస్తున్నందుకు రుణపడి ఉంటామని అన్నారు. అయితే ఆమె గత వారం హౌస్ లోకి వెళ్లినప్పుడు కౌశల్ కి బయట విషయాలు చెప్పారని, అందుకే కౌశల్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వీటిపై స్పందించిన ఆమె కౌశల్ కి ఏం చెప్పలేదని, చాలా తక్కువ విషయాలు చెప్పానని అన్నారు. కౌశల్ కి మద్దతు చేయాలని కోరుకుంటూనే.. ఇతర కంటెస్టెంట్స్ పై ట్రోల్స్ చేయొద్దని, వారికి కూడా కుటుంబాలు ఉంటాయని.. తిట్టడం కరెక్ట్ కాదని నీలిమ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు
Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి