జపాన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` సంచలనం.. ఏడాదిపాటు థియేటర్లలో రచ్చ.. కలెక్షన్లు ఎంతో తెలిస్తే షాకే

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన ఇండియన్‌ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం మూడేళ్ల క్రితం థియేటర్లోకి వచ్చి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడానికి ముందు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ చేసిన పోరాటం నేపథ్యంలో సాగే కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఆస్కార్‌ అవార్డుని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రికార్డుని క్రియేట్‌ చేసింది. అదేంటో చూద్దాం. 
 

rrr movie japan collections its create new record in telugu arj

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ మూడేళ్ల క్రితం విడుదలై ఆకట్టుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1200కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టింది. అయితే మేకర్స్ ఆశించిన టార్గెట్‌ రీచ్‌ కాలేదు. దాదాపు రూ.1500కోట్లకుపైగా వసూళ్లని రాబడుతుందని, `బాహుబలి 2`ని రీచ్‌ అవుతుందని భావించారు. కానీ ఆ విషయంలో డిజప్పాయింట్‌ చేసింది. 

ఆస్కార్‌తో `ఆర్‌ఆర్‌ఆర్‌` సరికొత్త రికార్డు..

సినిమాకి ఇండియన్‌ ఆడియెన్స్ నుంచి, ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ నుంచి కొంత పెదవి విరుపు కనిపించింది. అయినా బాగానే ఆడింది. అయితే `ఆస్కార్‌`తో అన్ని అసంతృప్తులను బ్రేక్‌ చేసింది.ఈ చిత్రం `నాటు నాటు` పాటకి గానూ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డుని సాధించిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, `నాటు నాటు` పాట రచయిత చంద్రబోస్‌ ఆస్కార్‌ అందుకున్నారు. 

జపాన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఏకంగా ఏడాదికిపైగా ప్రదర్శన..

Latest Videos

డైరెక్ట్ ఇండియన్‌ మూవీకి టెక్నీకల్‌ విభాగంలో ఆస్కార్‌ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలా `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ ఇండియన్‌ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ మూవీ జపాన్‌లో సంచలనంగా మారింది. ఆ దేశంలో ఏడాదికిపైగా ఆడిన సినిమాగా `ఆర్‌ఆర్‌ఆర్` నిలవడ విశేషం. అంతేకాదు కలెక్షన్ల విషయంలోనూ భారీ వసూళ్లని రాబట్టింది. 

జపాన్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా `ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డు..

జపాన్‌ దేశంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ ఏడాదికిపైగా ప్రదర్శించడంతోపాటు మన ఇండియన్‌ రూపీ ప్రకారం అక్కడ ఈ చిత్రం ఏకంగా రూ.150కోట్లు(2.5 బిలియన్స్ జపాన్‌ యీన్స్) వసూలు చేసిందట. దీంతో ఇది జపాన్‌ లో అత్యధిక వసూళ్లని రాబట్టిన ఇండియన్‌ మూవీగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఆయనకు జోడీగా అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా నటించారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. 
 

vuukle one pixel image
click me!