షాక్: విజ‌య్ దేవ‌రకొండ నెక్ట్స్ ఆ డిజాస్టర్ డైరక్టర్ తోనా...?

Published : May 25, 2019, 10:01 AM IST
షాక్: విజ‌య్ దేవ‌రకొండ నెక్ట్స్ ఆ డిజాస్టర్ డైరక్టర్ తోనా...?

సారాంశం

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ  తో సినిమా చేస్తే సక్సెస్ దానంతట అదే వస్తుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నడుస్తోంది. క

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ  తో సినిమా చేస్తే సక్సెస్ దానంతట అదే వస్తుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నడుస్తోంది. కథలో తేడా ఉన్నా, మిగతా విభాగాల్లో సమస్య ఉన్నా విజయదేవరకొండ ఒంటిచేత్తో లాక్కెళ్లిపోతాడని నమ్ముతున్నారు. దాంతో అందురూ విజయ్ దేవరకొండ చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. 

దానికి తోడు విజయ్  దేవరకొండ డేట్స్ తెచ్చుకుంటే సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ సిద్దంగా ఉండటం కూడా వారిని ఊరిస్తోంది. అయితే విజయ్ దేవరకొండ సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన రీసెంట్ గా పడిపడి లేచే మనస్సు అనే డిజాస్టర్ చిత్రం ఇచ్చిన హను రాఘవపూడి తో సినిమా కమిటయ్యారని చెప్పుకుంటున్నారు.  ఈ సినిమాని స్వప్న సినిమాస్  నిర్మిస్తోందని వినికిడి. 

ఇప్ప‌టికే ఈ బ్యాన‌ర్‌లో `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`, `మ‌హాన‌టి` చిత్రాలు చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇక అందాల రాక్షసి తప్ప చెప్పుకోదగ్గ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో రాలేదు. కాస్ట్ ఫెయిల్యూర్ ఆయన సినిమాల్లో ప్రధానంగా కనపడుతోంది. అయితే ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా సైతం భారీ బడ్జెట్టే అంటున్నారు.  మిల‌ట‌రీ నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ట‌. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావటానికి కొంత టైమ్ పడుతోందిట. 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా