మోడీ గెలిచారుగా.. పాక్ కు పారిపో.. నటిపై నెటిజన్లు ఫైర్!

Siva Kodati |  
Published : May 25, 2019, 08:42 AM ISTUpdated : May 25, 2019, 08:44 AM IST
మోడీ గెలిచారుగా.. పాక్ కు పారిపో.. నటిపై నెటిజన్లు ఫైర్!

సారాంశం

నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ కేంద్రంలో మరోమారు అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు నమో మంత్రాన్ని జపించడంతో బిజెపి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటేసి 303 లోక్ సభ స్థానాలని సొంతం చేసుకుంది. 

నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ కేంద్రంలో మరోమారు అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు నమో మంత్రాన్ని జపించడంతో బిజెపి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటేసి 303 లోక్ సభ స్థానాలని సొంతం చేసుకుంది. ఎన్డీయే పక్షాలతో కలుపుకుంటే 352 సీట్లతో తిరుగులేని ఆధిక్యం లభించింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ సినీప్రముఖుల్లో మోడీ విజయాన్ని కాంక్షించిన వారు ఉన్నారు.. అలాగే మోడీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నవారూ ఉన్నారు. 

బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ బిజెపి సాధించిన ఘనవిజయంపై మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. భారత ప్రజలు బలమైన తీర్పుని ఇచ్చారు. నరేంద్ర మోడీకి అలాగే బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు నా అభినందనలు అని షబానా ట్విటర్ లో పేర్కొన్నారు. ఆమె మోడీ గురించి పాజిటివ్ గా స్పందించినా నెటిజన్లు మాత్రం వదిలిపెట్టడం లేదు. 

షబానా అజ్మీ గతంలో మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇటీవల షబానా అజ్మీ మాట్లాడుతూ.. మోడీ రెండోసారి అధికారంలోకి వస్తే దేశం వదలి వెళ్ళిపోతా అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలని సరిచేసుకుంటూ.. తాను ఇండియాలోనే పుట్టానని, తుదిశ్వాసవరకు ఇక్కడే ఉంటానని వ్యాఖ్యానించారు. 

ఓ నెటిజన్.. మీరు మోడీకి శుభాకాంక్షలు చెప్పడం ఓకే.. కానీ పాకిస్తాన్ కు ఎప్పుడు వెళిపోతారో చెప్పండి అని ప్రశ్నించాడు. మరో నెటిజన్.. రాత్రికి కూడా పాక్ కు వెళ్లేందుకు బండి ఉంది అని కామెంట్ చేశాడు. ఇలా షబానా అజ్మీకి సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం