స్నేహం కోసం సమంత పిలుపు.. టీడీపీ అభ్యర్థి గెలుపు!

Siva Kodati |  
Published : May 25, 2019, 08:07 AM IST
స్నేహం కోసం సమంత పిలుపు.. టీడీపీ అభ్యర్థి గెలుపు!

సారాంశం

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావించే గుంటూరు జిల్లాలో వైసిపి తిరుగులేని విజయం సాధించింది. గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 15 సీట్లని వైసిపి గెలుచుకుంది. టిడిపికి కేవలం రెండు మాత్రమే దక్కాయి. రేపల్లె నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ మరోమారు విజయం సాధించారు. 

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావించే గుంటూరు జిల్లాలో వైసిపి తిరుగులేని విజయం సాధించింది. గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 15 సీట్లని వైసిపి గెలుచుకుంది. టిడిపికి కేవలం రెండు మాత్రమే దక్కాయి. రేపల్లె నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ మరోమారు విజయం సాధించారు. వైసిపి ప్రభంజనంతో బడా లీడర్లు సైతం ఓడిపోయారు. కానీ అనగాని సత్యప్రసాద్ వైసిపి జోరుని తట్టుకుని నిజయోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. 

సత్యప్రసాద్ గెలుపులో సినీనటి సమంత పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు సమంత సోషల్ మీడియా వేదికగా సత్య ప్రసాద్ ని గెలిపించాలని ప్రజలని కోరారు. సత్య ప్రసాద్ సోదరి మంజుల సమంతకు మంచి స్నేహితురాలు. దీనితో తన స్నేహితురాలి కోసం సమంత సత్య ప్రసాద్ కు మద్దతు తెలిపింది. ఆ విధంగా సత్య ప్రసాద్ గెలుపులో సమంత పాత్ర కూడా ఉందని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhanush: మృణాళ్ కంటే ముందు ధనుష్ ఇంత మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా?
Allari Naresh: అల్లరి నరేష్‌ ఇంట్లో విషాదం.. తాత కన్నుమూత.. కారణం ఇదే