Beast Second Song: `జాలీ ఓ జింఖానా` పాటతో అదరగొడుతున్న విజయ్‌.. ట్రెండింగ్‌

Published : Mar 19, 2022, 07:08 PM IST
Beast Second Song: `జాలీ ఓ జింఖానా` పాటతో అదరగొడుతున్న విజయ్‌.. ట్రెండింగ్‌

సారాంశం

విజయ్‌, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం `బీస్ట్`. ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. `జాలీ ఓ జింఖానా` అంటూ సాగే పాట విడుదలై దూసుకుపోతుంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

థళపతి విజయ్‌(Vijay) హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం `బీస్ట్`(Beast). దిలిప్‌ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటిస్తుంది. సన్‌ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఏప్రిల్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ జోరు పెంచింది యూనిట్‌. ఇటీవల తొలి పాట `అరబికుత్తు`ని విడుదల చేయగా, అది మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆ పాట 70 మిలియన్స్ ని దాటుకుని వంద మిలియన్‌ వ్యూస్‌ దిశగా పరిగెత్తుతుంది. 

తాజాగా శనివారం మరో పాటని విడుదల చేశారు. `జాలీ ఒ జింఖానా`(Jolly o Gymkhana) అంటూ సాగే పాటని రిలీజ్‌ చేసింది యూనిట్‌. పూర్తి లిరికల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేయగా, ఇది ట్రెండ్‌ అవుతుంది. అటు సోషల్‌ మీడియాలో, మరోవైపు యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతుంది. విడుదలైన గంటలోపే రెండు మిలియన్‌ వ్యూస్‌ని రాబట్టుకోవడం విశేషం. అనిరుథ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించిన ఈ పాటని కు కార్తిక్‌ రాశారు. ఇదిలా ఉంటే ఈ పాట థళపతి విజయ్‌ ఆలపించడం విశేషం. జానీ మాస్టర్‌ నృథ్యాలు కంపోజ్‌ చేశారు.

ఈ పాటలో విజయ్‌, పూజా హెగ్డేలు ఆటాపాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కనువిందు చేస్తుంది. తనదైన డాన్సు స్టెప్పులతో అదరగొడుతున్నారు విజయ్‌. మరోవైపు సింగర్‌గా ఆయన ఆకట్టుకుంటున్నారు. విజయ్‌ మంచి నేపథ్య గాయకుడనే విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక పాటలు ఆలపించారు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాటని ఆలపించడం ఆనవాయితీగా వస్తుంది. మాస్టర్‌ చిత్రంలో `కుట్టీ స్టోరీ`పాటని అలపించారు. ఇప్పుడు `జాలీ ఓ జింఖానా` పాటని పాడటం విశేషం. దీంతో ఈ పాట ట్రెండ్‌ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?