Dasara Movie Update : ‘దసరా’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. రేపు నాని ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్..

Published : Mar 19, 2022, 06:04 PM IST
Dasara Movie Update : ‘దసరా’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. రేపు నాని ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్..

సారాంశం

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ (Dasara). ఈ  చిత్రం గత నెలలోనే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ మూవీకి సంబంధించి  క్రేజీ అప్డేట్ అందించారు.

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో  ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singh Roy)తో  మంచి విజయం సాధించాడు. అదే జోష్ లో వరుసగా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న నాని.. ప్రస్తుతం ‘దసరా’ Dasara షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా దసరా మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.  

నాని నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’ నుంచి మొన్ననే హీరోయిన్ నజ్రియా నజీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నాని  సుందర్ ప్రసాద్ పాత్రలో నటిస్తున్నారు. నజ్రియా లీలా థామస్ పాత్రను పోషిస్తోంది. మూవీ ఈ ఏడాది జూలై  10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సుందరానికీ నుంచి అప్పుడప్పుడు అప్డేట్స్ వదులుతూనే ఉన్నారు. .. కాగా, నాని రెండో చిత్రం ‘దసరా’ నుంచి కూడా అప్డేట్స్ షురూ అయ్యాయి. మేకర్స్ అందించిన తాజా అప్డేట్ ప్రకారం.. ‘రేపు దసరా నుంచి గ్లిమ్స్ లేదా ఫస్ట్ లుక్ లేదా ఈ రెండూ రావొచ్చూ’ అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. రేపు ఉదయం 11.34 నిమిషాలకు ఈ అప్డేట్ రిలీజ్ కానుంది. 

అయితే, అప్డేట్ అందిస్తూ మేకర్స్ మాస్ లుక్ లో ఉన్న పోస్టర్ ను  వదలడం రేపటి అప్డేట్ పై మరింత ఆసక్తిని నెలకొల్పుతోంది. ఒక విలేజ్ లో నానితో పాటు అక్కడి గ్రామస్తులు లుంగీ కట్టుకొని నడుచుంటూ వస్తున్న ద్రుశ్యాన్ని చూడవచ్చు. అయితే నాని కాళ్లు మొత్తం మట్టితో నిండిపోవడంతో ఏదో మాస్ ఫైట్ కు సంబంధించిన సన్నివేశపు ఫొటోలాగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. నాని సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడనుంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఆగస్టులోనే మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి