
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా ‘రాధేశ్యామ్’ సినిమా క్రితం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ లో, కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 200 కోట్లకు పైగా జరిగింది. సినిమా ఒక విజువల్ వండర్ అని ప్రచారం చేసారు. అద్భుతమైన లవ్ స్టోరీకి మరింత అద్భుతమైన విజువల్స్ ని జత చేసి సినిమాని చిత్రీకరించారని ఇంటర్వూలలో డైరక్టర్ చెప్పుకొచ్చారు. అయితే భాక్సాపీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకుంది. ఈ విషయమై పూజ హెగ్డే బాలీవుడ్ మీడియాతో మాట్లాడింది.
పూజ హెగ్డే మాట్లాడుతూ.... “ ప్రతీ సినిమా తనకంటూ సొంత విధి రాసి పెట్టి ఉంటుంది. నేను దాన్ని బాగా నమ్ముతాను. కొన్నిసార్లు జస్ట్ ఓకే ఫిల్మ్ అనుకున్నవి భాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేస్తాయి. ఒక్కోసారి మనకు నచ్చిన సినిమాలు కూడా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావు. కాబట్టి ప్రతీ సినిమాకు దాని రిజల్ట్ భాక్సాఫీస్ దగ్గర ముందే రాసి ఉంటుంది ” అని చెప్పుకొచ్చింది.
ఇక సినిమాలో తన క్యారక్టర్ గురించి మాట్లాడుతూ...“నా పాత్రను చూసి చాలా మంది నన్ను ఎప్రిషియేట్ చేస్తున్నారు. అది నాకు సంతోషంగా ఉంది. అలాగే పూజ చాలా అందంగా ఉందని చెప్పటమే కాకుండా నా ఫెరఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. థియోటర్స్ నుంచి బయిటకు వచ్చేటప్పుడు వారితో పాటు ప్రేరణ పాత్ర కూడా వస్తోంది. నాలుగేళ్ల పాటు ఓ సినిమాపై మన జీవితం , హృదయం, ఆత్మ పెట్టినప్పుడు..ఇలాంటి మెచ్చుకోలు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది ." అని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించింది. సౌత్ లాంగ్వేజెస్‌కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు.