మెగాహీరో కోసం విలన్ గా మారిన స్టార్ హీరో!

Published : Mar 19, 2019, 03:45 PM IST
మెగాహీరో కోసం విలన్ గా మారిన స్టార్ హీరో!

సారాంశం

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి 'సై రా'లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి 'సై రా'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మరో మెగాహీరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

హీరో సాయి ధరం తేజ్ తమ్ముడు, చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది.

ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు విజయ్ సేతుపతిని తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నారు. సినిమాలో హీరో, విలన్ అనే బేధాలు లేకుండా కథ ప్రకారం స్క్రీన్ ప్లే ఉంటుందట.

ఆ రకంగా చూసుకుంటే విజయ్ సేతుపతి పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. ఆ కారణంగా విజయ్ సేతుపతి విలన్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌